Share News

జగన్‌రెడ్డికి బీసీలే బుద్ధి చెప్పాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:50 PM

బీసీలే వెన్నెముక అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఇప్పుడు వారి వెన్నెముకను విరిచేశారని, అలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో బీసీలే బుద్ధి చెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పిలుపునిచ్చా రు. బుధవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

జగన్‌రెడ్డికి బీసీలే బుద్ధి చెప్పాలి
మాట్లాడుతున్న కూన రవికుమార్‌

- టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవి

అరసవల్లి, మార్చి 6: బీసీలే వెన్నెముక అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఇప్పుడు వారి వెన్నెముకను విరిచేశారని, అలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో బీసీలే బుద్ధి చెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పిలుపునిచ్చా రు. బుధవారం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు గత టీడీపీ హయాంలో రూ.75వేల కోట్లు కేటాయిస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ నిధులను దారి మళ్లించ డం నిజం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి ధర్మా న మాయమాటలు మానేసి.. ఈ ప్రశ్నకు సమా ధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 34 శాతం పదవులను కేటాయిస్తాం. వచ్చే ఐదేళ్లలో బీసీల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. ఈ విషయాలను బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించాం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు 38 సం క్షేమ పథకాలు అమలు చేశాం. 75 నియోజకవ ర్గాల్లో పేద బీసీ విద్యార్థుల చదువు కోసం జ్యోతి రావు పూలే స్కూళ్ల ఏర్పాటుకు రూ.25కోట్ల చొప్పు న నిధులు కేటాయించాం. 50ఏళ్లు దాటిన మత్స్య కారులు, చేనేత, గీత కార్మికులకు పింఛన్లు ఇచ్చాం. వాటిని వైసీపీ ప్రభుత్వ రద్దు చేయడం నిజం కాదా?. 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నా.. వాటికి రూపాయి అయినా కేటా యించిందా?. ఇది బీసీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహం కాదా? దీనికి మంత్రి ధర్మాన సమాధానం చెప్పాలి. మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 50ఏళ్లు దాటిన బీసీ లకు నెలకు రూ.4వేలు పింఛన్‌గా చెల్లిస్తాం. వారి రక్షణకు కొత్త చట్టం తీసుకువస్తాం. జయహో బీసీ సభను చూసిన వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు మొదలైంది.’ అని రవికుమార్‌ అన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్‌, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమణ మాదిగ, రాష్ట్ర తెలుకల సాధికార సమితి డైరెక్టర్‌ కొమ్మనాపల్లి వెంకటరామరాజు, ఐటీడీపీ అధ్యక్షుడు ప్రధాన విజయరాం పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:50 PM