Share News

కార్మిక ద్రోహి జగన్‌రెడ్డి

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:18 AM

కార్మిక ద్రోహి జగన్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. ఆదివారం పైడిభీమవరంలో కార్మిక చైతన్యయాత్రలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాజహింస జరుగుతుందని, కష్టపడి పనిచేసిన కార్మికులు హక్కుల కోసం రోడెక్కే పరిస్థితి వచ్చిందన్నారు.

కార్మిక ద్రోహి జగన్‌రెడ్డి
రణస్థలం: పైడిభీమవరం కార్మిక చైతన్య యాత్రలో మాట్లాడుతున్న కళా వెంకటరావు

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కళావెంకటరావు

రణస్థలం, జనవరి 7: కార్మిక ద్రోహి జగన్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. ఆదివారం పైడిభీమవరంలో కార్మిక చైతన్యయాత్రలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాజహింస జరుగుతుందని, కష్టపడి పనిచేసిన కార్మికులు హక్కుల కోసం రోడెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసి నిధులు దారి మళ్లించిన ఘనుడు జగన్‌రెడ్డి అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌రెడ్డి మహిళలను మోసం చేశాడన్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు పర్మినెంట్‌ చేస్తానని, మూడు లక్షల మంది కార్మికులకు అన్యాయం చేసిన ఘనుడు జగన్‌రెడ్డి అని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి, నెల్లిమర్ల టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగారాజు, టీఎన్‌టీయూసీ నాయకులు జగ న్నాఽథంనాయుడు, రౌతు శ్రీనివాసరావు, టీడీపీ నేతలు లంక శ్యామల రావు, లంక ప్రభ, గొర్లె విజయనాయుడు, పిసిని జగన్నాఽథంనాయుడు, దన్నాన సత్తిబాబు, కనకారావు, పైడి అప్పడదొర, పిన్నింటి భానోజీ నాయుడు, జనసేన నేత వడ్డాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే కార్మిక సంక్షేమం

ఎచ్చెర్ల: టీడీపీతోనే కార్మిక సంక్షేమం సాధ్యమని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రఘురామరాజు అన్నారు. టీడీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాబు ష్యూరిటీ- కార్మికుల భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్ర మం ఆదివారం చిలకపాలెం జంక్షన్‌ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన ఆటో యూనియన్‌ నాయకులతో కలిసి వారి జెండాలను ఆవిష్క రించిన అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు గాడు నారాయణరావు, ఆ సంఘ జోన్‌ 1, 2, 3 నాయకులు లెనిన్‌, సింధూజ, పరమేశ్వరరావు, కార్మిక సంఘ నేతలు పాల్గొన్నారు.

అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తాం

గుజరాతీపేట: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. కార్మిక చైతన్య బస్సు యాత్రలో భాగంలో స్థానిక పాత బస్టాండ్‌ కూడలి లోని భవన నిర్మాణ కార్మికులతో ఆదివారం సమావేశమయ్యారు. కార్మికులు నాలుగన్నరేళ్లుగా పనులు లేక ఇబ్బంది పడుతున్నారని, చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కార్మికులు చాలక 40 లక్షల మందిని పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవారన్నారు. కార్యక్ర మంలో టీఎన్టీయూసీ జోన్‌ ఇన్‌చార్జిలు కోగంటి లెనిన్‌బాబు, అంబూరు సింఽధూజ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శివాజీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:18 AM