Share News

చెంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు జగన్‌ సిద్ధం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:50 AM

రాష్ట్రంలో సభలు నిర్వహిస్తున్న జగన్‌ రెడ్డి సిద్ధం అంటూ బజాలు ఎగరేస్తున్నారని, ఆయన దేనికి సిద్ధమో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎంపీ కింజరాపు రామ్మో హన్‌నాయుడు ప్రశ్నించారు. బాబాయిని చంపిన జగన్‌ ఇంకా ఎంతమందిని చంప డానికి సిద్ధమని, కల్తీ మద్యంతో మహిళల తాలిబొట్టు తెంచేందుకు సిద్ధమని తెలి పారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్‌రెడ్డి చెంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు మాత్రం ఖచ్చితంగా సిద్ధమని ఎద్దేవాచేశారు. చంద్రబాబునాయుడు 99 ఎమ్మెల్యే సీట్లను ప్రెస్‌మీట్‌ పెట్టి ఒకటి రెండు మూడు అని చెబుతుంటే జగన్‌ మదిలో ఎ1, ఎ2, ఎ3, ఎ4 అనే భావన మొదలైందని విమర్శించారు.ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం దోపిడీదారులకు సీట్లు కట్టబెడుతుందని ఆరోపించారు. పది కిలోమీటర్లు రోడ్డు వేసుకోలేని మంత్రి, స్పీకర్‌గా జిల్లా చరిత్రలో నిలిచిపోతారన్నారు. వంశఽ దార-నాగావళి, బాహుదా నదుల అనుసంధా నానికి టీడీపీ హయాంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,272 కోట్లతో జీవోను విడుదల చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవోను రద్దు చేసిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే శ్రీకాకుళం జిల్లాను ఎకనామిక్‌ హబ్‌గా చంద్రబాబు నాయుడు మారుస్తారని, దీంతో వలసలకు స్వస్తి పలుకుతామని ఎంపీ హామీఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడు ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానం కైవసం చేసుకుని సిక్కోలు టీడీపీకి కంచుకోట అని నిరూపించాలని కోరారు. సైకో జగన్‌రెడ్డి ప్రభుత్వానికి చెరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

   చెంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు జగన్‌ సిద్ధం
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్న:

శ్రీకాకుళం అర్బన్‌ :

స్టేడియం ఎందుకు నిర్మించలేకపోయారు..?

ఫ శ్రీకాకుళం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఽగుండ లక్ష్మీదేవి

శ్రీకాకుళంలో స్టేడియం నిర్మించలేకపోయిన ఎమ్మెల్యేనంటూ 2019 ఎన్నికల్లో ర్యాలీచేసి మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా రాజకీయ లబ్ధికోసం దూషించి అవమానించి ధర్మాన ప్రసాదరావు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా స్టేడియం ఎందుకు నిర్మించలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీకాకుళం టీడీపీ ఇన్‌చార్జ్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావొస్తున్నా, టీడీపీ హయాంలో మంజూరైన 15 కోట్ల నిధులతో స్టేడియం నిర్మా ణం ఎందుకు పూర్తిచేయలేదో సమాధానం చెప్పాలన్నారు. 33 కోట్లతో టీడీపీ హయాంలో కొత్తరోడ్డు నుంచి ఆమ దాలవలస వరకు 100 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణానికి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్నుడు శంకుస్థాపన చేసి టెండర్లు పిలిచామని తెలిపారు. ధర్మాన మంత్రిగా ఉండగా ఆ రోడ్డు పనులు ఎందుకు పూర్తి చేయలేదని లక్ష్మిదేవి నిలదీశారు. ఈ రోడ్డు నిర్మాణం జరగక రోడ్డు ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన వారిలో మానవత్వం మేల్కోకోకపోగా రోడ్డు పనులు చేపట్టకపోవడం మంత్రి ధర్మాన పనితీరుకు అద్ధం పడుతోందన్నారు. రోడ్డు పనులు చేపట్టలేని మంత్రి స్టేడియం ఎలా నిర్మించగలరని లక్ష్మీదేవి ఎద్దేవాచేశారు. శ్రీకాకుళం ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న న్నికల్లో మంత్రి ధర్మానతో పాటు వైసీపీకి ఓటు హక్కుతో బుద్ధి చెప్పి సైకోను తరిమికొడతారని జోస్యం చెప్పారు.

ధర్మాన సోదరులకు ఓటు అడిగే హక్కు లేదు

ఫ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌

జిల్లాలో ధర్మాన సోదరుల ఇంటి పేర్లోనే ధర్మం ఉందని, వారిద్దరూ చేసేదంతా అధర్మమేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూనరవికుమార్‌ విమర్శించారు. 37 కోట్లతో శ్రీకాకుళం ఆమదాలవలసరోడ్డును 100అడుగుల వెడల్పుచేసేందుకు టీడీపీ హ యాంలో శంకుస్థాపన చేశామని, కానీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్‌ సీతారాం పది కిలోమీటర్ల రోడ్డు నిర్మించలేకపోయారని విమర్శించారు. ఆర్థిక ఉగ్రవాది జగన్‌రెడ్డి ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చి టీడీపీ హయాంలోని 100 సంక్షేమ పఽథకాలను రద్దు చేసిన దుర్మార్గ సీఎం జగన్మోహన్‌రెడ్డి అని ఆరోపించారు. జిల్లాలో ఇసుక,మద్యం పేరుతో దోచు కుంటున్న ధర్మాన సోదరులకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు.రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని తెలిపారు.

ఫ్యాన్‌ రెక్కలు విరుద్దాం

ఫ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

ఒక్క చాన్స్‌ పేరుతో నమ్మి అవకాశం ఇచ్చినందుకు ప్రజలపై చెత్త పన్నుతో మొదలు పెట్టి ఆర్థిక భారాన్ని మోపి తాను మాత్రం విలాస జీవితం గడుపుతున్న తుగ్లక్‌ జగన్‌ను రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో ప్రజలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా ఫ్యాన్‌ రెక్కలు విరుద్ధామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించకపోగా సీఎం జగన్‌ పాలనలో పెట్టుబడులతోపాటు పరిశ్రమలు వెనక్కిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు.మళ్లీ టీడీపీ, జనసేన ప్రభుత్వంలోని చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

సైకో జగన్‌ను ప్రతిఘటిద్దాం

ఫ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ

రాష్ట్రంలో జగన్‌రెడ్డి నాయకత్వంలో విధ్వంస పాలన సాగుతోందని, అన్ని వ్యవ స్థలు, ప్రజల హక్కులను వైసీపీ ప్రభుత్వం హరించిందని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ధ్వజ మెత్తారు. జిల్లాలో ఇసుక, మద్యంతోపాటు అన్ని శాఖల్లో మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి పేరుకు పోయిందని ఆరోపించారు. రాష్ట్ర సంక్షేమం కోసం 2030 విజన్‌తో సీఎంగా ఉన్న చంద్ర బాబునాయుడు నాణ్యమైన విద్యన ందిస్తూ, వినూత్నమైన సంస్కరణలతో రాష్ర్టాన్ని అభివృద్థిపథం వైపు నడిపించారన్నారు.33 కేసుల్లో ముద్దాయిగా ఉన్న సీఎం జగన్‌ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ర్టాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు. సాయుధ విప్లవం చదివిన ఓటర్లు జగన్‌రెడ్డి అవినీతిని అంతమొందించేందుకు ఓటు హక్కుతో ప్రజా విప్లవానికి నాంది పలికి రానున్న ఎన్నికల్లో టీడీపీ- జనసేన అభ్యర్థులను గెలిపించి ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.

దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదాం

ఫ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బగ్గు లక్ష్మణరావు

చంద్రబాబుతో రాష్ట్రం ఎంతోగానో అభివృద్ధి చెందిందని, 2019లో వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మచ్చుకైనా కానరాలేదని టీడీపీ నాయకుడు బగ్గు లక్ష్మణరావు పేర్కొన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్‌రెడ్డి ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. దుర్మార్గపా లనకు చరమగీతం పాడు దామని పిలుపునిచ్చారు. మళ్లీ బాబు వస్తేనే అన్నివర్గాల సంక్షేమం సాధ్యమని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ- జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించి జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు.

ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుందాం

ఫ జనసేన ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి పిసిని చంద్రమోహన్‌

రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుని రాష్ర్టాన్ని సైకో బారి నుంచి కాపాడుకుందామని జనసేన ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి పిసిని చంద్రమోహన్‌ పిలుపునిచ్చారు. దుర్మార్గ పాలనను తరిమికొట్టేందుకు టీడీపీ కార్యకర్తలతో కలిసి జనసైనికులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు.

బాబుతోనే నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి: జనసేన నాయకుడు దానేటి శ్రీధర్‌

రాష్ర్టానికికాబోయే సీఎం చంద్రబాబునాయుడుతోనే నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యపడుతుందని జనసేన నాయ కుడు దానేటి శ్రీధర్‌ తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి 175 సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు.

Updated Date - Feb 27 , 2024 | 12:50 AM