Share News

ఓటు పండుగకు వేళాయే..

ABN , Publish Date - May 12 , 2024 | 11:57 PM

సార్వత్రిక ఎన్నికలు సోమవారం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పక్కాగా చేశారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన రిసెప్షన్‌ కేంద్రంలో పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది, ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు, ఇతర సామగ్రి కేటాయించారు. ఆర్వో, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ స్ట్రాంగ్‌ రూంలను తెరిచి పరిశీలించారు.

ఓటు పండుగకు వేళాయే..
పలాస: సిబ్బందికి సూచనలిస్తున్న ఆర్వో భరత్‌నాయక్‌

ఎన్నికలకు సర్వం సిద్ధం

గ్రామాలకు చేరుకున్న పోలింగ్‌ సిబ్బంది, సామగ్రి

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు రెడీ

టెక్కలి, మే 12: సార్వత్రిక ఎన్నికలు సోమవారం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పక్కాగా చేశారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పా టు చేసిన రిసెప్షన్‌ కేంద్రంలో పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది, ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు, ఇతర సామగ్రి కేటాయించారు. ఆర్వో, సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ స్ట్రాంగ్‌ రూంలను తెరిచి పరిశీలించారు. కేటాయించిన గ్రామా లకు పీవోలు, ఏపీవోలు ఈవీఎంలోని బ్యాటరీ శాతాన్ని పరిశీ లించుకొని సామాగ్రిని తరలించారు. ఈ ఏర్పాట్లను అబ్జర్వర్‌ సందీప్‌ కుమార్‌ ఆర్వోతో కలిసి పరిశీలించారు. టెక్కలి నియోజకవర్గ పరిధిలో 315 పోలింగ్‌ కేంద్రాలకు 280 మంది మైక్రో అబ్జర్వర్లను నియమిం చారు. 315 మంది పీవోలు, 315 మంది ఏపీవోలు, 1,260 మంది సిబ్బందితో పాటు వెయ్యి ఓట్లు అదనంగా ఉన్న పోలింగ్‌ బూత్‌లకు అద నపు సిబ్బందిని కేటాయించారు. ఈ ఏర్పాట్లు ప్రక్రియను ఏఎస్పీ ప్రేమ కాజోల్‌ పరిశీలించి సూచనలు చేశారు. దివ్యాం గులు, గర్భిణులకు ఎన్నికల విధులు కేటాయించడంతో తమను తప్పించాలని ఆర్వోను కోరారు. అనారోగ్యానికి గురైన మెండ చిలకమ్మ ఓపీవో విధులకు గాను నందిగాం మండలం కోటిపల్లికి వేయడంతో ఆమె తన అనారోగ్యం గురిం చి ఆర్వోకు వివరించారు. టెక్కలి నియోజకవర్గ పరిధి 315 పోలింగ్‌ కేంద్రాలకు 35కు పైగా బస్సులు, టాటా ఏస్‌ వాహనాల్లో సామగ్రిని సిబ్బంది తరలించారు.

పలాసలో..

పలాస/కాశీబుగ్గ: నియోజకవర్గంలో 284 పోలింగ్‌ కేంద్రా లుండగా, 37 చొప్పున సెక్టారు, రూట్‌ అధికారులను నియమిం చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సిబ్బందికి ఎన్నికల సామగ్రిని ఆదివారం కేటాయించారు. 1,704 మంది ఎన్నికల సిబ్బంది, 284 మంది పీవోలు, 284 మంది ఏపీవోలు, 1136 మంది అదనపు సిబ్బందిని నియమిం చినట్లు ఎన్నికల అధికారి, ఆర్డీవో భరత్‌ నాయక్‌ ప్రకటించారు. పలాస నియోజక వర్గానికి సంబంధించి మొత్తం 2,19,348 మంది ఓటర్లు ఉండగా వీరిలో స్ర్తీలు 1,12,049, పురుషులు 1,07,278, ట్రాన్స్‌జెండర్లు 21 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి సూచించారు. పోలింగ్‌కు కేటాయించిన వివిధ విభాగాల సిబ్బందికి సూచనలు చేశారు. మీకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లతో మాట్లాడ వద్దని, ఫోన్లు లోపలకి అనుమతించవద్దని, ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఉం టాయని, లోపలకు ఓటర్లను తప్ప ఇతరులను అనుమతించకూడదన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా స్పెషల్‌ ఫోర్స్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ ఎన్నికలకు పలాస నియోజక వర్గంలో పలాస మున్సిపాలిటీ, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండ లాల్లో 284 పోలింగ్‌ కేంద్రాలున్నాయన్నారు. పోలింగ్‌ సమయంలో ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 91 మంది ఏఎస్‌ఐలు, 203 మంది హెడ్‌కాని స్టేబుళ్లు, 213 మంది మాజీ సైని కులు, ఎస్‌సీసీ క్యాడెట్స్‌, 10 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఇచ్ఛాపురంలో...

సోంపేట/ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్‌ కేంద్రా లకు సిబ్బంది, ఈవీఎంలు, సామగ్రి కేటాయింపు ప్రక్రియ స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆదివారం చేపట్టారు. నియోజకవర్గంలో సుమారు 4000 మంది సిబ్బంది చేరుకున్న అనంతరం వారికి కేటాయించిన బస్సులు, ఇతర వాహనాల్లో ఆయా గ్రామా లకు తరలివెళ్లారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సోమవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అన్ని పోలింగ్‌ స్టేషన్‌ల వద్ద ఓటర్లకు ఎండదెబ్బ తరగలకుండా షామియానాలు ఏర్పాటు చేశారు. వృద్ధులకోసం ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచా రు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 1,30,751 మంది పురు షులు, 13,74,345 మంది మహిళలు, 17 మంది థర్డ్‌ జెండర్లు ఓటు హక్కును విని యోగించు కోనున్నారు.

ఎచ్చెర్లలో..

రణస్థలం: సార్వత్రిక ఎన్నికలకు ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో 309 పోలింక్‌ కేంద్రా లుండగా 1,854 మంది సిబ్బందిని నియమించారు. సోమవారం జరగబోయే పోలింగ్‌లో 2,44,760 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యే క పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పాతపట్నంలో..

పాతపట్నం: సార్వత్రిక ఎన్నికల నిర్వహ ణకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. ఆదివారం పాతపట్నంలో వ్యవసాయ మార్కె ట్‌ యార్డ్‌ ప్రాంగణంలో పాతపట్నం, మెళి యాపుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌ పేట మండలాలకు సంబంధించి 323 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్వో ఎం.అప్పారావు తెలిపారు. 33 రూట్‌ అధికా రులు, పీవోలు, ఏపీవోలను తరలించేందుకు 53 బస్సులు, 14 మినీ బస్సులు, 2 బొలారో, 7 ఇతర వాహనాలను ఏర్పాటు చేశారు. శాంతి యత వాతావరణలో పోలింగ్‌ నిర్వహణకు పోలీసు బలగాలను గ్రామాలకు తరలించారని ఆయన పేర్కొన్నారు.

ఆమదాలవలసలో..

ఆమదాలవలస: నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మునిసి పాలిటీ పరిధిలో ఉన్న 259 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి పీవోలు, ఏపీవో లు, సిబ్బందికి ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని కేటాయించే ప్రక్రియ ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో చేపట్టారు. ఈ ప్రక్రి యను రిటర్నింగ్‌ అధికారి, జేసీ నవీన్‌ పర్యవేక్షించారు. ఎటు వంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా నలుగురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, 11 మంది ఎస్‌ఐ ఆధ్వర్యంలో 205 మంది పోలీస్‌ సిబ్బం దిని, కేంద్ర బలగాలను కేటా యించారు. వీరితో పాటు మాజీ సైనికులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, సేవ లందిస్తారు. వీరందరికీ డీఎస్పీ శ్రీనివాసరావు సూచనలు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలకు వెళ్లే కేంద్ర బలగాలు ప్రశాంత ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆర్వో నవీన్‌ సూచిం చారు. ప్రశాంత ఎన్నికలకు పోటీ చేసే ప్రధాన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సహకరించాలని కోరారు.

Updated Date - May 12 , 2024 | 11:57 PM