ఐటీడీఏ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Dec 06 , 2024 | 12:49 AM
జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్య దర్శి డి.గోవిందరావు, కార్యదర్శి సభ్యులు కె.మోహ నరావు కోరారు.
మందస, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్య దర్శి డి.గోవిందరావు, కార్యదర్శి సభ్యులు కె.మోహ నరావు కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆది వాసీ హక్కులపై అన్యాయం చేస్తోందని విమర్శిం చారు. గురువారం మందస సీపీఎం కార్యాలయం లో వారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ భూములను ఆక్రమంగా స్వాధీనం చేసు కొని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపిం చారు. సమావేశంలో సీపీఎం నాయకులు ఆర్.ప్రకాశ రావు, ఆర్.దిలీప్‌కుమార్, మట్ట ధర్మారావు తెలిపారు.