Share News

కురిసింది వాన

ABN , Publish Date - May 15 , 2024 | 11:54 PM

జిల్లాలో పలుచోట్ల బుధవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం వరకూ ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు.

కురిసింది వాన
హిరమండలంలో కురుస్తున్న వర్షం

- జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

హిరమండలం/జి.సిగడాం/పాతపట్నం, మే15: జిల్లాలో పలుచోట్ల బుధవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం వరకూ ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. ఆ తరువాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. హిరమండలం, జి.సిగడాం, పాతప ట్నం, తదితర మండలాల్లో భారీ వర్షం పడింది. గంటకుపైగా పడిన వర్షానికి వాతావరణ చల్లబడింది. ఈ వర్షం వేసవి దుక్కులకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 15 , 2024 | 11:54 PM