Share News

చైర్మన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా ..?

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:52 PM

స్థానిక సీహెచ్‌సీలో మంగళవారం అదనపు గదులు ప్రారంభోత్సవంలో వైద్యాధికారులు ప్రోటాకాల్‌ పాటించకపో వడంపై పలాస- కాశీబుగ్గ మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

 చైర్మన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా ..?

పలాస: స్థానిక సీహెచ్‌సీలో మంగళవారం అదనపు గదులు ప్రారంభోత్సవంలో వైద్యాధికారులు ప్రోటాకాల్‌ పాటించకపో వడంపై పలాస- కాశీబుగ్గ మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శిలాఫలకంపై మునిసిపాలిటీలో ప్రథమ పౌరుడిగా తొలి వరుసలో చైర్మన్‌ పేరు ఉండాలి. అయితే అతి ఽథుల వరుసలో ఆయన పేరు చేర్చడంపై ఆసుపత్రి వైద్యాధికారు లు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చైర్మన్‌కు ఆసుపత్రిలో ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి అప్పలరాజు జోక్యంచేసుకుని ఆయన్ను శాంతిపజేసినా ఆయన అధికారుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. మరోసారి ఇటు వంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని ఆయనకు నచ్చజెప్పడంతో శాంతించారు. కాగా సీహెచ్‌సీలో రూ.5.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వాసుపత్రి అదనపు వార్డులను మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. ఫ పలాస రూరల్‌: పలాస పీఏసీఎస్‌ భవనాన్ని మంత్రి అప్పలరాజు ప్రారంభించారు.కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ పైల వెంక టరమణ, డీసీసీబీ చైర్మన్‌ రాజేశ్వరరావు, ఎంపీపీ ఉంగ ప్రవీణ, జడ్పీటీసీ ఎం.రత్నాలు, ఎంపీడీవో రమేష్‌నా యుడు, తహసీల్దార్‌ మధుసూదనరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:52 PM