Share News

సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:15 PM

రైతులు అవసరాల మేరకు సాగునీటిని పొదుపుగా వాడుకొని శివారు భూములకు నీరందేలా తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.

సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి
ఎన్‌బీసీ కాలువలో నీటి ప్రవాహానికి హారతి ఇస్తున్నఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

జలుమూరు: రైతులు అవసరాల మేరకు సాగునీటిని పొదుపుగా వాడుకొని శివారు భూములకు నీరందేలా తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. పెద్దదూగాం వద్ద వంశధార ప్రధాన ఎడమకాలవపై ఉన్న 24 నరసన్నపేట బ్రాంచి కాలువకు సోమవారం సాగునీటిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన నీటి ప్రవాహానికి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో సాగు నీటిపై నిర్లక్ష్యం చూపడం వల్ల శివారు భూములకు సాగునీరందలేద న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంట నే సాగునీటి విడుదలే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామన్నారు. 24 ఎన్‌బీసీ కాలువ ద్వారా నరసన్నపేట, జలుమూరు, పోలాకి మండలాలకు చెందిన 36, 337 ఎకరాలకు నీరందుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, నాయకులు బగ్గు గోవిందరావు, మెండ రాంబాబు, గుండ మన్మఽథరావు, పంచిరెడ్డి రామచంద్రరావు, టి.సతీష్‌, కింజరాపు సత్యం, పిరియా వెంకటరావు, తర్ర బలరాం, వంశధార డీఈ శ్రీహరి, ఏఈలు సురేష్‌, శ్యామలరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 11:15 PM