దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Sep 28 , 2024 | 12:13 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో గాంధీయాన్ సోషల్‌వర్క్ పీజీ డిప్లమో కోర్సులో ప్ర వేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో గాంధీయాన్ సోషల్‌వర్క్ పీజీ డిప్లమో కోర్సులో ప్ర వేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.సుజాత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక ఏడాది గల ఈ కోర్సులో చేరేందుకు ఏదైనా డిగ్రీ చదివినవారు అర్హులన్నారు. రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.2,500 ట్యూషన్ ఫీజును రిజిస్ట్రార్, డాక్టర్ బీఆర్‌ఏ యూ పేరిట డిమాండ్ డ్రాప్ట్ తీసి దరఖాస్తులను వచ్చే నెల 5వ తేదీలోగా వర్సిటీలోని సోషల్‌వర్క్ విభాగానికి అందజేయాలన్నారు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి ఎన్జీవో, మీడియా సంస్థల్లో, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆరోగ్య సం బంధిత ప్రాజెక్ట్‌లు, కౌన్సెలింగ్ కేంద్రాలు, సామాజిక అధ్యయన కేంద్రాల్లో ఉపాధి పొందే వీలుందన్నారు. మరిన్ని వివరాల కోసం సోషల్‌వర్క్ కోర్సు విభాగాధిపతి డాక్టర్ యు.కావ్యజ్యోత్స్న ఫోన్ నెంబర్లు 94945 20417, 63045 20703కు సంప్రదించాలన్నారు. అలాగే వర్సిటీ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డీఆర్‌బీఆర్‌ఏయూ డాట్ ఈడీయూ డాట్ ఇన్‌ను పరిశీలించాలన్నారు.
కేజీబీవీల్లోని పోస్టులకు..
గుజరాతీపేట: జిల్లాలో కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేత ర సిబ్బంది పోస్టుల భర్తీకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.తిరుమల చైతన్య తెలిపారు. బోధన సిబ్బంది పోస్టులకు సంబంధించి ఒప్పంద ప్రాతి పదికన (కాంట్రాక్టు), బోధనేతర సిబ్బందికు సంబంధించి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరాని కి గాను అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు లు కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఇందులో పీజీటీ మూడు, సీఆట్ 13, వార్డెన్ మూడు, పార్ట్ టైమ్ టీచర్స్ 16, అకౌంటెంట్ మూడు ఇలా.. మొత్తం 38 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తికలిగిన మహిళా అభ్యర్థు లు తమ ఆన్‌లైన్ దరఖాస్తులను వారి వెబ్‌సైట్ ద్వారా రూ.250 దరఖాస్తు రుసుం చెల్లించి అక్టోబరు పదో తేదీలోగా పంపించాలన్నారు. ఆఫ్‌లైన్, ఫిజికల్ దరఖాస్తులు స్వీకరించబడవని, అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరా ల వయస్సు వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈ డబ్ల్యూఎస్ వారుకి ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగినులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుందన్నారు.