Share News

బీసీలకు తీరని అన్యాయం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:36 AM

రాష్ట్రంలో జగన్‌ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. గురువారం పలాసలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే పలు చోట్ల ఆ పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, అగౌరవం గురించి వివరించారు.

బీసీలకు తీరని అన్యాయం
సోంపేట: మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

- ఒక్క బీసీ లబ్ధిదారునికీ రుణమివ్వని ప్రభుత్వం

- జగన్‌పై తెలుగుదేశం పార్టీ నాయకుల ధ్వజం

రాష్ట్రంలో జగన్‌ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. గురువారం పలాసలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే పలు చోట్ల ఆ పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, అగౌరవం గురించి వివరించారు.

మంత్రులు ప్రశ్నించరేం: శిరీష

పలాస: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేశా రని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నా, వైసీపీ బీసీ మంత్రులుగా పదవు లు అనుభవిస్తున్నవారు కనీసం ప్రశ్నించడం లేదన్నారు. గురువారం పలాస టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. పేరుకు బీసీ కార్పొరేషన్లు పెట్టి చైర్మన్లకు కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా అగౌరపరచారన్నారు. రూ.75వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించారని, తమ ప్రభుత్వ హయాంలో బీసీలకు పెద్దపీట వేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఆదరణ పేరుతో పరి కరాలు ఇచ్చి వారి జీవన ఉన్నతికి తోడ్పడ్డామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల పై ఎస్మా ప్రయోగించి ఉక్కుపాదం మోపడం దుర్మార్గమన్నారు. మునిసిపల్‌ కార్మికులు, 108 సిబ్బంది ఆందోళనలు జరుగుతున్నా వారికి ఏమి కావాలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఆగడాలు, భూ కబ్జాలు పెరిగి పోయాయని, సొంత అభివృద్ధి తప్పా పలాస అభివృద్ధిపై దృష్టిసా రించలేదని విమర్శించారు.ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌, రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, వంశధార కాలువ ఆధునీకరణ, ఏహెచ్‌సీ, హుద్‌హుద్‌ గృహాల కేటాయింపు మరిచి తమ నాయకులనే బెదిరించేస్థాయికి ఎదిగారని ఆరోపించారు. టీడీపీరాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు మాట్లాడుతూ బీసీల కోసం మాట్లాడే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. తొలుత ఎన్టీయార్‌ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో బీసీ సంఘ నాయకులు లొడగల కామేశ్వరరావుయాదవ్‌, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, టంకాల రవిశంకర్‌గుప్తా, శాసనపురి మురళీకృష్ణ, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, జోగ మల్లి, డొక్కర శంకర్‌, దువ్వాడ హేమబాబుచౌదిరి, దువ్వాడ శ్రీహర్ష, జనసేన నాయకుడు సంతోష్‌పండా, పెంట ఉదయ్‌శంకర్‌, డిక్కల ఆనంద్‌, టీడీపీ పరిశీలకులు కలమల సాగర్‌, ధర్మాన తేజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

సంజీవయ్యే నిదర్శనం: అశోక్‌

సోంపేట: జగన్‌రెడ్డి పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. గురువారం మాకన్నపురంలో విలేక రులతో మాట్లాడుతూ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని అందుకు ఎంపీ సంజీవయ్యే నిదర్శనమన్నారు. ఆయన లాగే ఇంకా ఎందరో వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తున్నానని చెబుతున్నప్పటికీ దానికి భిన్నంగా ప్రజల ఖాతాలు ఖాళీ అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్ర మోహన్‌, టీడీపీ మండల అధ్యక్షుడు మద్దిల నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వైసీపీలో గుర్తింపు లేని బీసీలు: కళా

ఎచ్చెర్ల: వైసీపీ పాలనలో బీసీ నే తలకు, ప్రజలకు సరైన గుర్తింపు లేద ని గురువారం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అన్నారు. వైసీపీతో వేగ లేక చాలా మంది బీసీ నేతలు బయ టకు వచ్చేస్తు న్నారన్నారు. వైసీపీ పాలనలో బీసీ వర్గాలకు ఒరిగిందేమీలే దన్నారు. సంక్షేమ పథకాల పేరిట ఓ వైపు డబ్బులు అందజేస్తున్నామని చెబుతూ.. మరో వైపు పన్ను ల పేరిట, ధరలను పెంచి అంతకు మించి గుంజేస్తున్నార న్నారు. వైసీపీ పాలనలో యువతకు సరైన ప్రోత్సాహం లేక పరాయి రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారన్నారు. రాను న్న ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

బీసీ ద్రోహి జగన్‌: ఎల్‌ఎల్‌ నాయుడు

టెక్కలి: రాష్ట్రంలో బీసీలద్రోహిగా ముఖ్యమంత్రి జగన్‌ గుర్తిండిపోతారని, బీసీ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారని టీడీపీరాష్ట్ర కార్యనిర్వాహక కార్య దర్శి ఎల్‌ఎల్‌ నాయుడు తెలిపారు. గురువారం టెక్కలిలో విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు వైసీపీ సర్కార్‌ చేసిందేమీ లేదని, మొక్కుబడిగా బీసీలకు సంబంధించి 59 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు లేక నిర్జీవంచేశారని ఆరోపించారు. ఒక్క బీసీ వ్యక్తికి కూడా కార్పొరేషన్ల ద్వారా రుణం ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నేడు బీసీ లకు రక్షణ కరువైందని, అధికారంలో ఉన్న బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాట్లాడే అధికారం లేకుండాపో యిందని తెలిపారు. వైసీపీలో సజ్జల, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి వంటి వారికే ప్రాధాన్యత తప్ప బీసీలకు ఆ పార్టీలో సరైన గౌరవం, సముచిత స్థానం లేదని, ఆ పార్టీలోఉన్న బీసీనాయకులు తలదించుకొని బతుకుతున్నారని ఆరోపించా రు. ఈ విషయాన్ని అధికార పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ బట్టబయలు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారశైలి వల్ల బీసీ యువతకు ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయని, ఉన్న పరిశ్రమలు వెళ్లిపోగా కొత్తపెట్టుబడులు ఆకర్షించలేకపోయారని తెలిపారు. వైసీపీలో బీసీలకు భవిష్యత్‌ లేదని, టీడీపీలో నాడు ఎన్టీఆర్‌ మొదలుకొని చంద్ర బాబునాయుడు వరకు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. బీసీలపై వైసీపీ సర్కార్‌ మొసలి కన్నీరు కారుస్తోందని ఆరోపించారు.

బీసీ నాయకులకు గౌరవం లేదు: సాలిన

ఇచ్ఛాపురం: వైసీపీలో బీసీ నేతలకు, ప్రజలకు ఎటువంటి గౌరవం లేద ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. డాక్టర్‌ సంజీవయ్య లాగే చాలామంది బీసీ నేతలు వైసీపీ వీడను న్నారని తెలిపారు. జగన్‌రెడ్డి పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగు తోందని పేర్కొన్నారు. బీసీ యువతకు సరైన విద్యా ప్రోత్సాహం అందడం లేదని, ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన నడుస్తోందని తెలిపారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీనిర్వీర్యం చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, కొత్తపరిశ్రమలు లేవని, ఉన్న పరిశ్రమలు కూడా ఏపీని విడిచి వెల్లిపోతున్నా యని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కన్నా అప్పులు వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. వైసీపీలో బీసీలకు రాజకీయ భవిష్యత్‌ లేదని, పార్టీ కేవలం ఒక సామాజిక వర్గం ఆధీనంలోనేఉందని పేర్కొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:36 AM