Share News

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:34 PM

వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి బగ్గ రమణమూర్తి అన్నారు.

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం
అంగూరులో సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలు అందిస్తున్న బగ్గు రమణమూర్తి

జలుమూరు (సారవకోట), మార్చి 24: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి బగ్గ రమణమూర్తి అన్నారు. ఆదివారం అంగూరు గ్రామంలో పర్యటించి ప్రజలను కలిశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించి, రానున్న టీడీపీ ప్రభుత్వంలో ఈ పథకాలను పక్కాగా అమలు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనను, ఎంపీగా రామ్మోహన్‌ నాయుడును గెలిపించాలని కోరారు. సవరడ్డపనస పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖలో బయటపడిన డ్రగ్స్‌ మాఫియాపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. డ్రగ్స్‌ మాఫియా వెనుక అధికార పార్టీ నేతలదే కీలకపాత్ర ఉందని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

యువతకు అండగా టీడీపీ
నరసన్నపేట:
యువతకు ఉపాధి కల్పనతోపాటు నిరుద్యోగి భృతి ఇచ్చి టీడీపీ అండగా ఉంటుందని తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష అన్నారు. ఆదివారం దూకలపాడులో సూపర్‌ సిక్స్‌ పథకా లను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కలిగించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల అభ్యర్థులు బగ్గు రమణమూర్తి, కింజరాపు రామ్మోహన్‌ నాయుడులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ అల్లు అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

నందిగాం: పెద్దలవునిపల్లిలో సూపర్‌సిక్స్‌ పథకాలపై ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు పి.అజయ్‌ కుమార్‌ విస్తృతంగా అవగాహన కలిగించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిం చాలని కోరారు.
టెక్కలి: రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి అన్నారు. ఆదివారం టెక్కలి మేజర్‌పంచాయతీ గొల్లవీధి, రెడ్డికవీధి ప్రాంతాల్లో సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు.
సంతబొమ్మాళి: టీడీపీ హయాంలోనే మత్స్య కారుల సంక్షేమం సాధ్యపడిందని ఆ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు జీరు భీమారావు, రెడ్డి అప్పన్న అన్నారు. ఆది వారం తీరప్రాంత గ్రామమైన జగన్నాఽథపురంలో ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకా లను వివరించారు. కార్యక్రమంలో తెలుగుయువత మండల అధ్యక్షుడు భానుప్రకాష్‌, ఐటీడీపీ అధ్యక్షుడు బెండి అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:35 PM