Electricity Charges Hike విద్యుత్ చార్జీల పెంపు పాపం జగన్‌దే: ఎంజీఆర్
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:55 PM
Electricity Charges Hike విద్యుత్ చార్జీ లు పెంచిన పాపం మాజీ సీఎం జగన్ రెడ్డిదేనని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

పాతపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ చార్జీ లు పెంచిన పాపం మాజీ సీఎం జగన్ రెడ్డిదేనని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక సీది కూడలిలో ఆదివా రం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ.. వైసీపీ హయాం లో విద్యుత్ చార్జీలు పెంచి ఇప్పుడు వారే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు నేటి కూటమి ప్రభుత్వానికి ఆపాదించడం దెయ్యాలు వేదాలు వల్లిం చడమేనన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై వేయా లని అప్పటి సీఎం జగన్ ఈఆర్సీని కోరారని ఆయన గుర్తు చేశారు. 2022-23, 2023-24 సంవత్సరాలకు ప్రజలపై భారం వేయాలని జగన్ ప్రభుత్వం ఆమో దం తెలిపి ఈఆ ర్సీకి పంపిందని, అంటే రెండేళ్ల కిందటే ఈ భారం వేయాల్సి ఉంద న్నారు. ఇప్పుడు విద్యుత్‌చార్జీల పెంపుపై ధర్నాలు చేపట్టడం హాస్యా స్పదంగా ఉంద న్నారు. కార్యక్ర మంలో పాలకొండ టీడీపీ ఇన్ చార్జి పడాల భూదేవి, నేతలు సలాన మోహన రావు, తులసీ వర ప్రసాద్, పైౖల బాబీ, సైలాడ సతీష్ పాల్గొన్నారు.