Share News

టీడీపీలో 200 కుటుంబాల చేరిక

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:50 PM

కవిటి మండలంలోని బెలగాం పంచాయితీకి చెందిన మాజీ సర్పంచ్‌ బి.జోగమ్మ, వాసుదేవ్‌తో పాటు బసవకొత్తూరు గ్రామస్థులు,కంచిలి మండలంలోని జాడుపూడి పంచాయతీ బసవపుట్టుగ గ్రామానికి చెందిన 200 కుటుంబాలు టీడీపీలో శనివారం చేరాయి.ఈ మేరకు బసవకొత్తూరులో ఏర్పా టుచేసిన కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి .మణిచంద్రప్రకాష్‌, సంతోష్‌పట్నాయక్‌, మోహన్‌రావు, పి .కృష్ణారావు, పిలక చిన్నారెడ్డి పాల్గొన్నారు.

  టీడీపీలో 200 కుటుంబాల చేరిక
పార్టీలో చేరినవారితో ఎమ్మెల్యే అశోక్‌:

కవిటి/కంచిలి:కవిటి మండలంలోని బెలగాం పంచాయితీకి చెందిన మాజీ సర్పంచ్‌ బి.జోగమ్మ, వాసుదేవ్‌తో పాటు బసవకొత్తూరు గ్రామస్థులు,కంచిలి మండలంలోని జాడుపూడి పంచాయతీ బసవపుట్టుగ గ్రామానికి చెందిన 200 కుటుంబాలు టీడీపీలో శనివారం చేరాయి.ఈ మేరకు బసవకొత్తూరులో ఏర్పా టుచేసిన కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి .మణిచంద్రప్రకాష్‌, సంతోష్‌పట్నాయక్‌, మోహన్‌రావు, పి .కృష్ణారావు, పిలక చిన్నారెడ్డి పాల్గొన్నారు.

ఫసోంపేట: సోంపేటలో ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి బెందాళంఅశోక్‌ జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజుతోకలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాక్షస పాలన పోవాలంటే టీడీపీ ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయనవెంట చంద్రమోహన్‌, చిత్రాడ శ్రీను, చిత్రాడ శేఖర్‌ ఉన్నారు.

రొట్టవలసలో వంద కుటుంబాలు..

సరుబుజ్జిలి:రొట్టవలసలో తెలుగుయువత మండలాధ్యక్షుడు తాడేల రాజా రావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాడేల వెంకట రమణ, నాయకుడు బెవర లక్ష్మణరావు ఆధ్వర్యంలో వంద కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పంచాయతీవార్డుసభ్యుడు గుజ్జల సింహాచలం, అక్కివరపు రాంబాబు, సువరపు రామారావు, వైసీపీ నాయకులు తొత్తడి వైకుంఠరావు, ధనుకోటి తవిటినాయుడు, వెంకటరమణ, దాలినాయడు, రమణమూర్తి, అప్పలనాయుడు తదితరులకు టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపురామ్మోహన్‌నాయుడుతోపాటు పార్టీజిల్లా అధ్యక్షు డు కూన రవికుమార్‌ కండువాలువేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, కిల్లి సిద్దార్థ, పల్లి సురేష్‌, ఈశ్వరరావు, తమ్మినేని చంద్రశేఖర్‌, రాము పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:50 PM