ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్పించండి
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:41 PM
గొర్రెలు, మేకల పశుపోషణ వృత్తిగా జీవిస్తున్న ఉత్తరాంధ్ర యాదవులు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనకబడి ఉన్నం దున బీసీ-డీ నుంచి బీసీ-బీలోకి చేర్చేలా కృషి చేయాలని ఆ సంఘం నేతలు కోరా రు.

కాశీబుగ్గ: గొర్రెలు, మేకల పశుపోషణ వృత్తిగా జీవిస్తున్న ఉత్తరాంధ్ర యాదవులు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనకబడి ఉన్నం దున బీసీ-డీ నుంచి బీసీ-బీలోకి చేర్చేలా కృషి చేయాలని ఆ సంఘం నేతలు కోరా రు. ఈ మేరకు సోమవారం విశాఖపట్నం లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీని వాసరావును కలిసి వినతిపత్రం అం దించారు. జనాభా దమాషా ప్రకారం రా జ్యాంగ పదవుల్లో యాదవులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పల్లాను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ యాదవ నాయకులు నర్తు పురుషోత్తం, ఇప్పిలి జగదీష్, దాసరి తాతారావు, సాలిన మాధవరావు, పత్రి లక్ష్మణరావు, బంగారి శివయాదవ్, వెంకటరావు, జగదీష్ పాల్గొన్నారు.