Share News

లోక్‌సభ ఎన్నికల్లో అతనిదే ‘రాజ’సం

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:39 PM

జిల్లాకు సంబంధించి 1952 నుంచి 2019 వరకు 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరుగగా అందులో ఆరుసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా బొడ్డేపల్లి రాజగోపాల రావు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే కింజరాపు ఎర్రన్నాయుడు నాలు గుసార్లు, ప్రస్తుతం పార్లమెంట్‌ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు రెండుసార్లు, డాక్టర్‌ కణితి విశ్వనాథం రెండుసార్లు, హనుమంతు అప్పయ్య దొర, ఎన్‌జీ రంగా, డాక్టర్‌ కిల్లి కృపా రాణి, గౌతు లచ్చన్న ఒక్కొక్కసారి పార్లమెంట్‌ సభ్యులుగా ఇప్పటివరకు పనిచేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో అతనిదే ‘రాజ’సం
బొడ్డేపల్లి రాజగోపాలరావు

(టెక్కలి)

జిల్లాకు సంబంధించి 1952 నుంచి 2019 వరకు 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరుగగా అందులో ఆరుసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా బొడ్డేపల్లి రాజగోపాల రావు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే కింజరాపు ఎర్రన్నాయుడు నాలు గుసార్లు, ప్రస్తుతం పార్లమెంట్‌ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు రెండుసార్లు, డాక్టర్‌ కణితి విశ్వనాథం రెండుసార్లు, హనుమంతు అప్పయ్య దొర, ఎన్‌జీ రంగా, డాక్టర్‌ కిల్లి కృపా రాణి, గౌతు లచ్చన్న ఒక్కొక్కసారి పార్లమెంట్‌ సభ్యులుగా ఇప్పటివరకు పనిచేశారు.

రాజగోపాలరావు..

తొలిసారి 1952లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్‌ అభ్యర్థి పీఎల్‌ఎస్‌ రాజుపై 9,399 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండోసారి 1957లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి కరిమి నారాయణ అప్పలనాయుడుపై 16,356 ఓట్ల మెజార్టీతో, మూడోసారి 1962లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి ఎస్‌.శ్రీనివాసరెడ్డిపై 31,815 ఓట్లతో, నాలుగోసారి 1971లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి ఎన్‌జీ రంగాపై 1,37,461 ఓట్ల మెజార్టీతో, ఐదోసారి 1977లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొడ్డేపల్లి రాజగోపాలరావు బీఎల్‌డీ అభ్యర్థి గౌతు లచ్చన్నపై 8,734 ఓట్లతో, ఆరోసారి 1980లో కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థిగా రాజగోపాలరావు పోటీచేసి జనతా(ఎస్‌) అభ్యర్థి గౌతు లచ్చన్నపై 78,980ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఎర్రన్నాయుడు..

1996లో తెలుగుదేశం పార్టీ తరఫున కింజరాపు ఎర్రన్నాయుడు పోటీ చేసి అన్నా టీడీపీ అభ్యర్థి నందమూరి జయకృష్ణపై 34,578 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1998లో టీడీపీ నుంచి బరిలోకి దిగి అన్నా టీడీపీ అభ్యర్థి హనుమంతు అప్పయ్యదొరపై 86,365 ఓట్లతో, 1999లో టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కణితి విశ్వనాథంపై 96,882 ఓట్లతో, 2004లో టీడీపీ తరఫున ఎర్రన్నాయుడు పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కృపారాణిపై 32,059 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

మిగతా అభ్యర్థులు..

ఫ 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున డాక్టర్‌ కణితి విశ్వ నాథం పోటీచేసి టీడీపీకి చెందిన హనుమంతు అప్పయ్య దొరపై 50,144 ఓట్లుతో, 1991లో కాంగ్రెస్‌ నుంచి మరోసారి కణితి విశ్వనాథం పోటీచేసి టీడీపీకి చెందిన హను మంతు అప్పయ్యదొరపై 26,664 ఓట్లతో గెలుపొందారు. ఫ 2014లో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మో హన్‌నాయుడు వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై 1,27,572 ఓట్లు, 2019లో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653 ఓట్లతో విజయం సాధించారు. ఫ 1967లో స్వతంత్య్ర అభ్యర్థి గౌతు లచ్చన్న కాంగ్రెస్‌ అభ్యర్థి బొడ్డేపల్లి రాజ గోపాలరావుపై 60,358 ఓట్లతో గెలు పొందారు. ఫ 1967 పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఎన్‌జీ రంగా కాంగ్రెస్‌ అభ్యర్థి బొడ్డే పల్లి రాజగోపాలరావుపై 52,644 ఓట్లతో గెలుపొందారు. ఫ 1984లో టీడీపీ అభ్యర్థి హనుమంతు అప్ప య్యదొర కాంగ్రెస్‌ అభ్యర్థి బొడ్డేపల్లి రాజగోపాలరావుపై 1,24,468 ఓట్లతో విజయం సాధించారు. ఫ 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి కిల్లి కృపారాణి టీడీపీ అభ్యర్థి కింజరాపు ఎర్రనాయుడుపై 82,987 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వైసీపీ నుంచి పేడాడ తిలక్‌లు పోటీ చేస్తున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:39 PM