పనితీరు మెరుగుపరుచుకోండి: జేసీ
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:57 PM
ప్రభుత్వ పథకాల అమలులో కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యం వీడి పనితీరు మెరుగుపరచుకోవాలని జాయింట్ కలె క్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు.

టెక్కలి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాల అమలులో కిందిస్థాయి అధికారులు నిర్లక్ష్యం వీడి పనితీరు మెరుగుపరచుకోవాలని జాయింట్ కలె క్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్లతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రతిరోజు విధులకు వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం పని చేస్తున్నారో గమనించు కుని బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం వినతులపై అర్జీ దారులు సంతృప్తి చెందేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ సర్వీసులు, పెండింగ్ కోర్టు కేసులు నిర్వ హణపై ఆరా తీశారు. విద్యార్థులకు బర్త్ సర్టిఫికేట్లు త్వరితగతిన జారీచేయాలన్నారు. అనంతరం గృహ నిర్మాణశాఖ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మండల ప్రత్యేకాధికారులతో గృహ నిర్మాణంపై సమీ క్షించారు. క్షేత్రస్థాయిలో లేఅవుట్ల వారీగా ఆరా తీశారు. ప్రతి ఒక్క అధికారి మూడు ఇళ్లకు వెళ్లి లబ్ధిదా రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీ వో ఎం.కృష్ణమూర్తి, పలు శాఖల అధికారులు తది తరులు పాల్గొన్నారు.