Share News

తప్పుడు సమాచారం ఇచ్చారో..

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:09 AM

ఎన్నికల్లో అఫిడవిట్‌ కీలకంగా మారింది. నామినేషన్‌ పత్రాల తో పాటు ఫారం-26 అఫిడవిట్‌ దాఖలు చేయాలి. అభ్యర్థులు తమ వివరా లతో పాటు ఆస్తులు,అప్పుల గురించి ప్రమాణపత్రం రూపంలో స్పష్టంచేయాలి. గతంలో ఏమైనా కేసులు ఉన్నా, శిక్షపడినా వాటినీ పొందు పరచాలి. ఇందులో తప్పుడు సమాచారం ఇస్తే అదే ప్రత్యర్థుల కు ఆయుధమై కోర్టు కేసుల వరకు వెళ్లడమే కాకుండా అనర్హతవేటుకు దారితీసే అవకాశముంటుంది.

తప్పుడు సమాచారం ఇచ్చారో..

హిరమండలం: ఎన్నికల్లో అఫిడవిట్‌ కీలకంగా మారింది. నామినేషన్‌ పత్రాల తో పాటు ఫారం-26 అఫిడవిట్‌ దాఖలు చేయాలి. అభ్యర్థులు తమ వివరా లతో పాటు ఆస్తులు,అప్పుల గురించి ప్రమాణపత్రం రూపంలో స్పష్టంచేయాలి. గతంలో ఏమైనా కేసులు ఉన్నా, శిక్షపడినా వాటినీ పొందు పరచాలి. ఇందులో తప్పుడు సమాచారం ఇస్తే అదే ప్రత్యర్థుల కు ఆయుధమై కోర్టు కేసుల వరకు వెళ్లడమే కాకుండా అనర్హతవేటుకు దారితీసే అవకాశముంటుంది.

అన్నీ పూరించాలి

అఫిడవిట్‌లోని ఏ ఒక్క కోలం ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సంబంధం లేకపోతే ఆ కాలం నిల్‌ లేదా వర్తించదని రాయాలని తెలియజేసింది. అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్‌ను గమనించి ఏదైనా సమాచారం లేకపోతే ఆర్వో నోటీసుఇస్తారు. దీంతో సవరించిన అఫిడవిట్‌ను అభ్యర్థి అందించాలి. అయినా పూర్తి స్థాయి వివరాలతో అఫిడవిట్‌ లేకపోతే పరిశీలన సమయంలో నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఆర్వోలు నోటీసు బోర్టు, వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

నేర సమాచారం తప్పనిసరి

క్రిమినల్‌ కేసులు నమోదై ఉంటే వాటి వివరాలను అఫిడవిట్‌లో పొందు పరచాలి. ఏదైనా కేసులో న్యాయస్థానాలు గతంలో శిక్ష విధించినా, అప్పీ ల్‌కు వెళ్లినా వాటి సమాచారాన్ని ప్రస్తావించాలి.సామాజిక మాధ్యమాల ఖాతాలను కూడా తెలియజేయాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవి ట్‌కు నోటరీ తప్పనిసరి. సాధారణంగా నామినేషన్‌ దాఖలు సమయంలో రిటర్నింగ్‌అధికారి ముందు అభ్యర్థి ప్రమాణంచేస్తారు. ఇతరులు ఎవరైనా నామినేషన్‌ సమర్పిస్తే అభ్యర్థి తాను ఉన్న ప్రాంతంలోని మెజిస్ర్టేట్‌ ఎదు ట ప్రమా ణం చేయాల్సి ఉంటుంది.అంతేకాకుండ అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకట నలు ఇవ్వాలి.

అప్పులు, ఆస్తులు పక్కాగా ప్రస్తావించాలి

స్థిర, చరాస్థుల వివరాలతో పాటు చేతిలో, బ్యాంకు ఖాతాల్లోని నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్‌, బీమా పాలసీలు,అప్పులు తదితరాలు పొందు పరచాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదా యాలు, నివాస స్థలాల వంటివాటిని అఫిడవిట్‌లో ప్రస్తావించాలి. అవి వారసత్వంగా వచ్చాయా లేదా కొనుగోలు చేశారా అన్నది తెలియజేయాలి. స్థిరాస్తులకు సంబంధించి ప్రస్తుత మార్కెట్‌ విలువలను పొందుపరచాలి. అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలనూ ప్రస్తావించాలి. కుటుంబ సభ్యుల ఆదాయ మార్గాలు, ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు తెలియజేయాలి.

వివరాలు తెలుసుకోవడం ఓటర్ల హక్కు

ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడం ఓటర్లు హక్కు. అప్పుడే అభ్యర్థులపై ఓ స్పష్టత వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే అభ్యర్థులు తమ నామినేషన్‌తో పాటు అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలకు లోబడి ఫారం-26 రూపంలో అభ్యర్థులు అఫిడవిట్‌ సమర్పించాలి. ఇందులో అభ్యర్థులు ఆస్తులు, అప్పులు, కేసుల సమాచారంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయాలి.

Updated Date - Apr 19 , 2024 | 12:09 AM