Share News

నిధులు లేక.. మురుగు తొలగించక

ABN , Publish Date - May 30 , 2024 | 11:24 PM

నియోజకవర్గంలోని ఆమదాల వలస, సరుబుజ్జిలి మండలాలతోపాటు మునిసిపాలిటీ పరిధిలోని పలు వీఽఽధుల్లో రహదారులు మురుగు కాలు వలను తలపిస్తున్నాయి. ప్రధానంగా నిధులు లేకపోవ డంతో మురుగునీటి సమస్య పరిష్కారానికి నోచుకో లేదు. ఐదేళ్లుగా పంచా యతీలు, మునిసిపల్‌ అధికా రులు రహదారులపై ప్రవహిస్తున్న మురుగునీటిని పట్టిం చుకోకపోవడంతో రోడ్లు కాలువులను తలపిస్తున్నాయి. దీంతో దుర్గంధభరిత వాతావరణంలో ప్రజలు గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మురుగు నీటి నిర్వహణపై ప్రజా ప్రతినిధులు చేతులెత్తేశారు.

నిధులు లేక.. మురుగు తొలగించక
ఆమదాలవలస మునిసిపాలిటీ పరిధిలోని ఏడో వార్డు చింతాడలో రహదారిపై నిలిచిపోయిన మురుగు నీరు

ఆమదాలవలస: నియోజకవర్గంలోని ఆమదాల వలస, సరుబుజ్జిలి మండలాలతోపాటు మునిసిపాలిటీ పరిధిలోని పలు వీఽఽధుల్లో రహదారులు మురుగు కాలు వలను తలపిస్తున్నాయి. ప్రధానంగా నిధులు లేకపోవ డంతో మురుగునీటి సమస్య పరిష్కారానికి నోచుకో లేదు. ఐదేళ్లుగా పంచా యతీలు, మునిసిపల్‌ అధికా రులు రహదారులపై ప్రవహిస్తున్న మురుగునీటిని పట్టిం చుకోకపోవడంతో రోడ్లు కాలువులను తలపిస్తున్నాయి. దీంతో దుర్గంధభరిత వాతావరణంలో ప్రజలు గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మురుగు నీటి నిర్వహణపై ప్రజా ప్రతినిధులు చేతులెత్తేశారు.

ఇదీ పరిస్థితి..

ఫ పంచాయతీలు, మునిసిపాలిటీల నిధులు వైసీపీ ప్రభుత్వం పలుసార్లు మళ్లించడంతో ప్రజాప్రతినిధులు మురుగునీటికాలువల పనులపై చేతులెత్తేవలసిన పరిస్థితి తలెత్తుతోంది. గతంలో పంచాయతీల్లో నిధులు ఉన్న సమయంలో వీధుల్లోని సీసీ రహదారులను శుభ్రం చేయడంతోపాటు డ్రైనేజీల్లో కూడా ప్రతినెలా పూడికతీత పనులతో చేపట్టేవారు. ప్రస్తుతం పంచాయతీలో నిధులు లేకపోవడంతో వీధిలైట్లు, తాగునీటి సమస్యలు పరిష్కరించడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు.

ఫమునిసిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. సీసీ రహదారులపై మురుగునీరు చేరి నిల్వఉండడం వల్ల పరిసర ప్రాంత ప్రజలకు దుర్వాసనతో పాటు దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారు.

ఫ వేసవిలోనే సీసీ రహదారులపై మురుగునీరు నిల్వ ఉంటుందంటే వర్షాకాలంలో వీధి రహదారులన్నీ చెరువులు తలపించే విధంగా తయారు కావడం ఖాయమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లో 51 పంచాయతీలు, మునిసిపాలిటీ పరిధిలో 23 వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. రహదారులపై మురుగునీరు చేరుతున్నా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులు పర్యవేక్షణ లోపించిందని విమర్శలొస్తున్నాయి.

Updated Date - May 30 , 2024 | 11:24 PM