Share News

టెండర్‌ ఓటంటే..

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:16 PM

ఓ వ్యక్తి తన ఓటును మరో వ్యక్తి వినియోగించుకున్నారని ఫిర్యాదు చేస్తే.. ఆ ఓటరు కోసం ఎన్నికల సంఘం టెండరు ఓటు సౌకర్యం కల్పిస్తుంది. దీని ద్వారా ఆ వ్యక్తి ఓటు వేయవచ్చు. ఎన్నికల సంఘం నిబంధనలోని సెక్షన్‌ 42 ప్రకారం టెండర్‌ ఓటు ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రిసైడింగ్‌ అధికారులకు ముందస్తుగా మార్గదర్శకాలు అందజేస్తారు. దీంతో ఓటింగ్‌ సమయంలో వచ్చిన కిట్‌లో టెండరు ఓటు కూడా ఇస్తారు. ఓటింగ్‌ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు కమిషనర్‌కు ఈ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఓటరు తన ఓటు వేరేవారు వేశారని తెలిస్తే ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలి. తర్వాత దీన్ని పరిశీలించి గుర్తింపును ధ్రువీక రిస్తారు. అనంతరం టెండరు ఓటుకు డిమాండ్‌ చేయాలి. అయితే ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి అవకాశం లేదు. బ్యాలెట్‌ సహాయంతో ఇటువంటి ఓటు వేయడానికి అవకాశం కల్పించారు.

 టెండర్‌ ఓటంటే..

పలాస: ఓ వ్యక్తి తన ఓటును మరో వ్యక్తి వినియోగించుకున్నారని ఫిర్యాదు చేస్తే.. ఆ ఓటరు కోసం ఎన్నికల సంఘం టెండరు ఓటు సౌకర్యం కల్పిస్తుంది. దీని ద్వారా ఆ వ్యక్తి ఓటు వేయవచ్చు. ఎన్నికల సంఘం నిబంధనలోని సెక్షన్‌ 42 ప్రకారం టెండర్‌ ఓటు ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రిసైడింగ్‌ అధికారులకు ముందస్తుగా మార్గదర్శకాలు అందజేస్తారు. దీంతో ఓటింగ్‌ సమయంలో వచ్చిన కిట్‌లో టెండరు ఓటు కూడా ఇస్తారు. ఓటింగ్‌ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు కమిషనర్‌కు ఈ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఓటరు తన ఓటు వేరేవారు వేశారని తెలిస్తే ప్రిసైడింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయాలి. తర్వాత దీన్ని పరిశీలించి గుర్తింపును ధ్రువీక రిస్తారు. అనంతరం టెండరు ఓటుకు డిమాండ్‌ చేయాలి. అయితే ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి అవకాశం లేదు. బ్యాలెట్‌ సహాయంతో ఇటువంటి ఓటు వేయడానికి అవకాశం కల్పించారు.

Updated Date - Apr 25 , 2024 | 11:16 PM