Share News

ఇచ్ఛాపురం.. వైసీపీకి డౌటే!

ABN , Publish Date - May 23 , 2024 | 12:34 AM

- టీడీపీకి కంచుకోటగా నియోజకవర్గం - గత ఎన్నికల్లోనూ చెక్కుచెదరని ఓటర్లు - ఈసారీ టీడీపీ అభ్యర్థే గెలుస్తారని బెట్టింగ్‌లు (ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఇచ్ఛాపురం.. వైసీపీకి డౌటే!

- టీడీపీకి కంచుకోటగా నియోజకవర్గం

- గత ఎన్నికల్లోనూ చెక్కుచెదరని ఓటర్లు

- ఈసారీ టీడీపీ అభ్యర్థే గెలుస్తారని బెట్టింగ్‌లు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఇచ్ఛాపురం నియోజకవర్గం టీడీపీకి కంచు కోట. గత ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఒక్కచాన్స్‌ హవా లోనూ.. ఇక్కడ సైకిలే దూసుకెళ్లింది. 1982లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2019 వరకూ ఈ నియోజక వర్గంలో తొమ్మిదిసార్లు ఎన్నికలు జరగ్గా.. ఎనిమిది పర్యాయాలు టీడీపీ గెలుపొంది రికార్డు సాధించింది. 2004లో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్‌ విజయం సాధించింది. వైసీపీ మాత్రం ఇంతవరకూ బోణీ కొట్టలేదు. ఈసారీ అదే సెంటిమెంట్‌ కొన సాగుతుందని విశ్లేషకులు అం చనా వేస్తున్నారు. వరుసగా రెం డుసార్లు గెలుపొందిన టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్‌.. హ్యాట్రిక్‌ సాధిస్తారని కొందరు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఎలా గైనా ఈసారి ఇచ్ఛాపురంలో గట్టిపోటీ ఇస్తున్నామని వైసీపీ ప్రగల్భాలు పలికినా.. విజయంపై ఆ పార్టీ నేతల్లోనూ సందేహం వ్యక్తమవుతోంది. గెలు స్తామో.. లేదోనన్న గుబులు వారిలో కనిపి స్తోంది.

- ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో టీడీపీకే పట్టం కట్టారు. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన పిరియా సాయిరాజ్‌ విజయం సాధించారు. కానీ కొన్నాళ్లకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వైసీపీ నుంచి నర్తు రామారావు, టీడీపీ నుంచి బెందాళం అశోక్‌ పోటీ పడ్డారు. 53.95శాతం ఓట్లతో బెందాళం అశోక్‌ గెలిశారు. 2019లో వైసీపీ నుంచి పిరియా సాయిరాజ్‌ పోటీచేయగా... టీడీపీ నుంచి మళ్లీ బెం దాళం అశోక్‌ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో జగన్‌ ఒక్కచాన్స్‌ కారణంగా ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలకుగానూ 8చోట్ల వైసీపీ విజయం సాధించింది. టెక్కలి, ఇచ్ఛాపురంలో మాత్రం టీడీపీ చెక్కు చెదరలేదు. రెండోసారీ అశోక్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ అభ్య ర్థిగా పిరియా సాయిరాజ్‌ సతీమణి, జడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, టీడీపీ తరపున మూడో సారి అశోక్‌ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే... టీడీపీ ప్రాభవం ఉన్నచోట.. వైసీపీ హవా చూపించలేకపోయింది. పోల్‌మేనేజ్‌మెంట్‌లో సైతం వైసీపీ నాయకులు నిధులు వెనకేసుకున్నారు. ఓటర్లకు అరకొరగానే నగదు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వేసుకునేందుకు సీఎం జగన్‌ కూడా ప్రణాళిక వేశారు. కానీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. ఇచ్ఛాపురంలో టీడీపీకి తిరుగులేదని.. అశోక్‌ హ్యాట్రిక్‌ సాధిస్తారని.. ఎన్టీయే కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. కాగా.. వైసీపీ నాయకులు మాత్రం.. తాము గెలుస్తామో.. లేదోనని టెన్షన్‌ పడుతున్నారు.

అభివృద్ధిని పక్కనబెట్టి..

ప్రభుత్వం.. రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలి. కానీ గత ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో టీడీపీ అభ్యర్థి అశోక్‌ విజయం సాధించరన్న కారణంతో.. ఈ నియో జకవర్గంలో అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం విస్మరిం చింది. జల్‌జీవన్‌మిషన్‌ ఆధ్వర్యంలో సీఎం జగన్‌.. ఆదరాబాదరాగా కుళాయిలను ప్రారంభించి.. మమ అనిపించేశారు. కొద్దిరోజులకే కుళాయిల పనితీరు కూడా ఆర్భాటంగానే మిగిలిపోయింది. ఇక టీడీపీ ప్రభు త్వ హయాంలో చేపట్టిన ఎన్టీఆర్‌ సుజలధార వంటి పథకాల నిర్వహణను కూడా పట్టించుకోలేదు. ఈ నియోజకవర్గంలో నూ అత్యధిక కిడ్నీ రోగులున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కిడ్నీ రోగులను ప్రాథమిక స్థాయిలో గుర్తించేందుకు ప్రత్యేక శిబిరం నిర్వహించింది. ఉచితంగా మందులను కూడా అందజేసింది. డయాలసిస్‌ సెంటర్లను సైతం ఏర్పాటు చేసింది. సీకేడీ రోగులకు పెన్షన్లు కూడా ఇచ్చింది. 2018లో తితలీ తుఫాన్‌ సమయంలో చంద్రబాబు సీఎంగా ఈ జిల్లాలోనే ఉంటూ పనులను పర్యవేక్షించి బాధితులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకున్నా రు. ఆ అభిమానం ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. పొత్తులో భాగంగా జనసేన కూడా టీడీపీకి కలిసిరావడంతో.. అగ్నికి వాయువు తోడైనట్టు కూటమి బలం మరింత పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదేళ్లు ఈ నియోజక వర్గ అభివృద్ధిని విస్మరించడంతో.. వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగిందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తమకు ఓటమి తప్పదని కొంతమంది వైసీపీ నాయకులు మదనపడుతున్నారు. బెట్టింగ్‌ల విషయానికొస్తే.. టీడీపీ అభ్యర్థే గెలుపు ఖాయమని.. ఇరుపార్టీలకు చెందిన చోటానాయకులు పందెం వేస్తున్నారని సమాచారం. ఏదిఏమైనా ప్రజాతీర్పు కోసం మరో 12 రోజులు వేచి చూడాల్సిందే.

2019లో ‘ఇచ్ఛాపురం’లో పోలైన ఓట్లు..

అభ్యర్థి పార్టీ లభించిన ఓట్లు

బెందాళం అశోక్‌ టీడీపీ 79,992 (46.39ు)

పిరియా సాయిరాజ్‌ వైసీపీ 72,847 (42.25ు)

దాసరి రాజు జనసేన 11,123 (6.45ు)

నోటా నోటా 3,880 (2.25ు)

కొల్లి ఈశ్వరరావు కాంగ్రెస్‌ 2,138 (1.24ు)

జన్నాల సూర్యవరప్రసాదరావు బీజేపీ 1,826 (1.06ు)

గణప వనజాక్షి ఇండిపెండెంట్‌ 617 (0.36ు)

మొత్తం 1,72,423 (69.54ు)

Updated Date - May 23 , 2024 | 12:34 AM