అధికారులమంటూ హల్‌చల్
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:25 PM
అధికారులమంటూ ఒక బ్యాచ్ మండలంలో సంచరిస్తోంది. ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి హల్‌చల్ చేస్తోంది. పాఠశాలలు నిర్వహణ బాగులేదని, యాజమాన్యాన్ని భయపెట్టి డబ్బులు గుంజుకొనే పనిలో ఒక బ్యాచ్ మంగళవారం పలు పాఠశాలను సందర్శించారు.
రణస్థలం: అధికారులమంటూ ఒక బ్యాచ్ మండలంలో సంచరిస్తోంది. ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి హల్‌చల్ చేస్తోంది. పాఠశాలలు నిర్వహణ బాగులేదని, యాజమాన్యాన్ని భయపెట్టి డబ్బులు గుంజుకొనే పనిలో ఒక బ్యాచ్ మంగళవారం పలు పాఠశాలను సందర్శించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని ఓ ప్రై వేట్ స్కూల్‌ను ఇద్దరు వ్యక్తులు సందర్శించి ఆర్‌టీఏ, హ్యూమన్ రైట్స్ సిబ్బంది మంటూ హడావుడి చేశారు. తాము విజయనగనం నుంచి వచ్చామని, పాఠశాల నిర్వహణ బాగులేదని, డబ్బులు ఇవ్వాలని సదరు వ్యక్తులు డిమాండ్ చేశారని ఆ పాఠశాల డైరెక్టర్ తెలిపారు. పాఠశాల వద్ద అసభ్యకరంగా ప్రవర్తించిన వారిద్దరని జేఆర్ పురం పోలీస్ స్టేషన్‌కు అప్పజెప్పారు. దీంతో ఎస్‌ఐ కె.గోవిందరావు విచారించగా, సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ వారిని మందలించి విడిచిపెట్టారు. ఇలాంటివి పుణరావతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు.