Share News

వేధింపుల కేసులో భర్తకు రెండేళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:12 PM

భార్యను వేధించిన కేసులో భర్తకు రెండేళ్ల జైలుశిక్షను విధిస్తూ జూనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి హెచ్‌.హరిప్రియ శుక్రవారం తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

వేధింపుల కేసులో భర్తకు రెండేళ్ల జైలు శిక్ష

నరసన్నపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): భార్యను వేధించిన కేసులో భర్తకు రెండేళ్ల జైలుశిక్షను విధిస్తూ జూనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి హెచ్‌.హరిప్రియ శుక్రవారం తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్థానిక గాంధీనగర్‌కు చెందిన బొనెల సాంబశివరావు అలియస్‌ సాంబ నిత్యం మద్యం సేవించి భార్య నాగలక్ష్మిని వేధించేవాడు. దీనిపై భార్య 2022 డిసెంబరు 5న పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్‌ఐ సింహాచలం, ఏఎస్‌ఐ కాంతారావు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై శుక్రవారం న్యాయాధికారి విచారణ చేపట్టారని, నేరం రుజువు కావడంతో సాంబశివరావుకు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని, ఏపీపీ శాంతి సంతోషి వాదించారని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Oct 25 , 2024 | 11:12 PM