మానవ హక్కులు కాపాడాలి
ABN , Publish Date - Dec 10 , 2024 | 11:48 PM
మానవ హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు హ్యమన్ రైట్స్ నేషనల్ ఫెడరేషన్ కౌన్సిల్ నియోజకవర్గ అధ్యక్షుడు దక్కత కృష్ణమూర్తిరెడ్డి అన్నారు.
ఇచ్ఛాపురం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మానవ హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు హ్యమన్ రైట్స్ నేషనల్ ఫెడరేషన్ కౌన్సిల్ నియోజకవర్గ అధ్యక్షుడు దక్కత కృష్ణమూర్తిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన మానవ హక్కుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మాన వ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరి ష్కరించేందుకు కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్ ఏర్పడి నట్లు తెలిపారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్వర్ణభార తి, ఆదిత్య డిగ్రీ కళాశాలలతో పాటు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులకు వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రోబిన్ కుమార్‌పాడి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జె.సదయ్య, హ్యూమన్ రైట్స్ నియోజకవర్గ కార్యదర్శి ఎం. రాంబాబు, ఆర్గనైజేషన్ సెక్ర టరీ రామారావు, అసిస్టెంట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కేసీ పూరి, తులసిరావు పాల్గొన్నారు.