Share News

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:38 PM

బస్సులో దొరికిన పర్సును సంబంధిత వ్యక్తి కి అందించి ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని చాటుకున్న ఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి..

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ
శ్రీధర్‌కు పర్సును అందజేస్తున్న ఆర్టీసీ సిబ్బంది

పాతపట్నం: బస్సులో దొరికిన పర్సును సంబంధిత వ్యక్తి కి అందించి ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని చాటుకున్న ఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. పలాస నుంచి కొత్తూరు వైపు వెళుతున్న పలాస డిపో ఆర్టీసీ బస్సులో పాత పట్నం వస్తున్న కె.శ్రీధర్‌ తన పర్సును పోగొట్టుకున్నాడు. వెనుక సీట్‌లో కూర్చొని ఉండగా గతుకుల రోడ్డు వల్ల బస్సు కుదుపులకు పర్సు జారి పోయింది. ఆ తరువాత పర్సు పో యిందని గుర్తించి ఆర్టీసీ కంట్రోల్‌రూం సిబ్బందికి సమా చారం ఇచ్చాడు. ఇదిలా ఉండగా బస్సులో పర్సును గుర్తించిన కండక్టర్‌ టీబీ రావు, డ్రైవర్‌ పీఎస్‌ చలం పర్సును భద్రపరిచి కొత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో సదరు శ్రీధర్‌కు అంద జేశారు. పర్సులో రూ.6400 నగదు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డ్‌లున్నాయి. పర్సు దొరకడంతో శ్రీధర్‌ ఆనందం వ్యక్తంచేసి ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 11:38 PM