Share News

ఇంటి కల..కల్ల

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:07 AM

పేదల సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు వారికి టిడ్కో గృహాలను అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో డీడీలు కట్టిన పేదలు టిడ్కో గృహాల అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క ఇళ్లు అందక.. మరోపక్క కట్టిన డబ్బులు తిరిగి రాక ఆందోళన చెందుతున్నారు. జగనన్నా మా గోడు పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి కల..కల్ల
ఏఎస్‌పేటలో టిడ్కో గృహాలు:

పేదల సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు వారికి టిడ్కో గృహాలను అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో డీడీలు కట్టిన పేదలు టిడ్కో గృహాల అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క ఇళ్లు అందక.. మరోపక్క కట్టిన డబ్బులు తిరిగి రాక ఆందోళన చెందుతున్నారు. జగనన్నా మా గోడు పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

(ఇచ్ఛాపురం)

ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలోని పేదలకు సొంతింటి కల నేర వేరలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ మౌలిక సదుపాయాల సంస్థ (టిడ్కో) పేదలకు ఆవాస సౌకర్యం కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రెండుచోట్ల లేఅవుట్ల ఏర్పాటుచేసి ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంది. లబ్ధిదారుల పేర్లు నమోదుచేసుకుని వారి వద్ద నుంచి డీడీలను స్వీకరించింది. టీడీపీ హయాంలో ఇళ్ల నిర్మాణాలు కొంతమేర జరిగాయి. ఇంతలో 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఇళ్ల పనులు నిలిచిపోయాయి. దీంతో లబ్ధిదారులు డీడీల రూపంలో చెల్లించిన సొమ్ముల కోసం మునిసిపల్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. లబ్ధిదారులు డీడీలు చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వచ్చింది. వీటికి వడ్డీలు పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము చెల్లించిన డీడీల డబ్బుల వడ్డీ ప్రభుత్వం ఖాతాకు చేరుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. తమకు ఆవాసాలు లేకపోగా, అప్పులు మిగిలాయని పలువురు వాపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

ఇచ్ఛాపురం మునిసిపాలిటీ పరిధిలో 816 మందికి టిడ్కో గృహాలు మంజూరు కాగా ఇందులో 672 మంది లబ్ధిదారులు డీడీల రూపంలో సొమ్ము చెల్లించారు. 144 మంది రూ.లక్ష చొప్పున, 480 మంది రూ.500 చొప్పున చెల్లించారు. ఇందులో 300 ఎస్‌ఎఫ్‌టీ గృహాలకు 144మందికి, 430 ఎస్‌ఎఫ్‌టీ గృహాలు 48 మందికి మంజూరు చేసి మొత్తం 192మంది లబ్ధిదారులకు రిజిస్టర్‌ డాక్యుమెంట్లు ఇచ్చారు. కానీ, ఇంతవరకూ ఇళ్లను అప్పగించలేదు. మిగతా 480 మంది లబ్ధిదారులకు ఇళ్లు లేదు కదా వారు డీడీల రూపంలో చెల్లిం చిన డబ్బులు కూడా ఇంత వరకు ఇవ్వకపోవడంతో కాళ్లు అరిగేలా మునిసిపల్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

పునాదుల్లో నిలిచిన నిర్మాణాలు..

ఏఎస్‌పేట రహదారి పక్కన, ఏఎస్‌పేట కాలనీ పరిధిలో టిడ్కో ఆధ్వర్యంలో రెండు లేఅవుట్లు వేశారు. కాలనీలో టిడ్కో గృహాలు నిర్మాణాలు పునాదులు స్థాయిలోనే నిలిచిపోయాయి. ఏఎస్‌పేట మెయిన్‌ రోడ్డుకు పక్కన నిర్మించిన 192 గృహాలు నిర్మాణాలు పూర్తి చేసినా రోడ్లు, తాగునీరు, పూర్తిస్థాయిలో విద్యుత్‌సదుపాయం కల్పించకపోవడంతో ఇంతవరకూ లబ్ధిదారులకు అందజేయలేదు.

Updated Date - Apr 19 , 2024 | 12:07 AM