Share News

సెలవు రోజు తరగతులు సరికాదు

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:22 AM

ప్రభుత్వం అన్ని పాఠశాలలకు సం క్రాంతి పురస్కరించుకుని సెలవులు మంజూరు చేస్తే, తలుపులు వేసి తరగతులు నిర్వహిస్తుండడం సరికా దని టెక్కలిమండల విద్యా శాఖాధికారులు తులసీరా వు, చిన్నారావులు ఓ పాఠ శాల యాజమాన్యానికి స్పష్టం చేశారు. గురువారం టెక్కలిలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తోందని ఏబీవీపీ నాయ కులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఈవోలు తనిఖీచేశారు. ఓ గదికి తాళం వేసి కిటికీలు మూసి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడాన్ని ఎంఈవోలు గుర్తించి తాళం తెరిపించారు. కిటికీలు మూసి చీకటిగదిలో పాఠా లు చెప్పడంపై సంబంధిత డైరెక్టర్‌, ఉపాధ్యాయులపై ఆగ్రహంవ్యక్తం చేశారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఎంఈవోలు పాఠశాల యాజమాన్య ప్రతినిధులపై మండిపడ్డారు. సెలవు నిబంధనలు పాటించరా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకోసారి ఈ పరిస్థితి జరిగితే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ఎంఈవోలతో పాటు ఏబీవీపీ నాయకులు మురళి, మదన్‌, అరవింద్‌, శ్యామ్‌ తదితరులు ఉన్నారు.

 సెలవు రోజు తరగతులు సరికాదు
తరగతి గదికి తాళం వేసి ఉండడంపై పరిశీలిస్తున్న ఎంఈవోలు:

టెక్కలి: ప్రభుత్వం అన్ని పాఠశాలలకు సం క్రాంతి పురస్కరించుకుని సెలవులు మంజూరు చేస్తే, తలుపులు వేసి తరగతులు నిర్వహిస్తుండడం సరికా దని టెక్కలిమండల విద్యా శాఖాధికారులు తులసీరా వు, చిన్నారావులు ఓ పాఠ శాల యాజమాన్యానికి స్పష్టం చేశారు. గురువారం టెక్కలిలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తోందని ఏబీవీపీ నాయ కులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంఈవోలు తనిఖీచేశారు. ఓ గదికి తాళం వేసి కిటికీలు మూసి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడాన్ని ఎంఈవోలు గుర్తించి తాళం తెరిపించారు. కిటికీలు మూసి చీకటిగదిలో పాఠా లు చెప్పడంపై సంబంధిత డైరెక్టర్‌, ఉపాధ్యాయులపై ఆగ్రహంవ్యక్తం చేశారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఎంఈవోలు పాఠశాల యాజమాన్య ప్రతినిధులపై మండిపడ్డారు. సెలవు నిబంధనలు పాటించరా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకోసారి ఈ పరిస్థితి జరిగితే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. ఎంఈవోలతో పాటు ఏబీవీపీ నాయకులు మురళి, మదన్‌, అరవింద్‌, శ్యామ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:22 AM