తెగుళ్లను నివారిస్తే అధిక దిగుబడులు
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:54 PM
పంటల్లో తెగుళ్లను గుర్తించి నివారిస్తే అధిక దిగు బడులు సాధించవచ్చని వ్యవసాయాధి కారి పి.లతాశ్రీ అన్నారు.
-వ్యవసాయాధికారి లతాశ్రీ
చొర్లంగి(ఎల్.ఎన్.పేట): పంటల్లో తెగుళ్లను గుర్తించి నివారిస్తే అధిక దిగు బడులు సాధించవచ్చని వ్యవసాయాధి కారి పి.లతాశ్రీ అన్నారు. మండలంలోని చొర్లంగిలో బుధవారం పొలంబడి కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెగుళ్ల నివారణకు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది ఇచ్చే సలహాలు, సూచనలను రైతులు పా టించాలన్నారు. పురుగు మందులు పిచికారి చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ సిబ్బంది బాలచంద్రుడు, రాకేష్, రైతులు పాల్గొన్నారు.