Share News

జిల్లాలో భారీ వర్షం

ABN , Publish Date - May 31 , 2024 | 11:55 PM

జిల్లాలో పలుచోట్ల శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

జిల్లాలో భారీ వర్షం
ఆమదాలవలసలో కురుస్తున్న వర్షం

హరిపురం/ ఇచ్ఛాపురం/ కంచిలి/ సోంపేట/ సరుబుజ్జిలి: జిల్లాలో పలుచోట్ల శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. హరిపురం, ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, సరుబుజ్జిలి, ఆమదాలవలసలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు హరిపురంలో మామిడి కాయలు నేలరాలాయి. కంచిలిలో విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేశారు. కాగా, నెలరోజులుగా ఎండవేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది.

Updated Date - May 31 , 2024 | 11:55 PM