Share News

మోసపూరిత హామీలతో కాలం వెల్లబుచ్చాడు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:33 PM

ఐదేళ్లుగా ఎటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా సీఎం జగన్‌ కాలం వెల్లబుచ్చాడని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీబాపన్నపేట, ఉప్పరపేట, చిన్న హరిశ్చంద్రపురం గ్రామాల్లో పర్యటిం చారు.

మోసపూరిత హామీలతో కాలం వెల్లబుచ్చాడు
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో అచ్చెన్నాయుడు

వైసీపీకి చరమగీతం పాడుదాం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు

టెక్కలి, ఫిబ్రవరి 20: ఐదేళ్లుగా ఎటువంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా సీఎం జగన్‌ కాలం వెల్లబుచ్చాడని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. మంగళవారం కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీబాపన్నపేట, ఉప్పరపేట, చిన్న హరిశ్చంద్రపురం గ్రామాల్లో పర్యటిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లను తుంగలో తొక్కాడని విమర్శించారు. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాల పేర్లు మారుస్తూ కొన సాగించారని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత రెట్టింపు సంక్షేమ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్ని కల్లో టీడీపీ కార్యకర్తలు, నేతలు సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీ పీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవింద రాజులు, జనసేన నాయ కులు కణితి కిరణ్‌ కుమార్‌, పల్లి కోటేశ్వర రావు, టీడీపీ నాయకులు బోయిన రమేష్‌, వెలమల కామేశ్వరరావు, విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, గొండు లక్ష్మణ రావు, పూజారి శైలజ, రమణమ్మ, వాన లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలోకి భారీ చేరికలు

టెక్కలి, కోటబొమ్మాళి మండలాల నుంచి పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. కోట బొమ్మాళి పార్టీ కార్యాలయంలో వీరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానిం చారు. వైసీపీలో చేరిన వారిలో కోటబొమ్మాళికి చెందిన తాలాసు కృష్ణ, తలాసు రాజేష్‌, పొట్నూరు నరసింహమూర్తి, రమణమూర్తి, సకలాభక్తుల భీమారావు, వెంకటరావు, సంతో ష్‌, సునీల్‌, హరి, కిరణ్‌, పొట్నూరి మణిదీప్‌, నందాన గోవిం ద్‌, అందవరపు కృష్ణారావు, బోయిన ఈశ్వరరావు తదితరు లున్నారు. టెక్కలి మండలం బన్నువాడ పంచాయతీ నుంచి వైసీపీ వార్డు సభ్యుడు కొల్లి ధర్మారావు, నంబాళ నారాయణ, రమణ, కొల్లి దుర్యోధన రావుతో పాటు 20 కుటుం బాలు, టెక్కలి ఆది ఆంధ్రవీధి నుంచి గొల్ల వలస ఢిల్లేశ్వరరావు, చింతల భాషా, ఉర్జాన ఏసు, కిర్రి మణి, దేవాది తరుణ్‌, గోపాల్‌, పవన్‌, రోహిత్‌, మల్లేసులతో పాటు 70 కుటుం బాలు, వంశధార కాలనీ నుంచి గూన సింహాచలం, శివ సాగర్‌, పవన్‌కుమార్‌, సాయి, బాలరాజులతో పాటు మరి కొందరు టీడీపీలో చేరారు. హరిశ్చంద్రపురం ఉప సర్పంచ్‌ మెగిలి రామారావు అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:33 PM