140 బస్తాల ధాన్యం పట్టివేత
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:10 AM
Harvesting 140 bags of grain అంపురం జంక్షన్ వద్ద ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 140 ధాన్యం బస్తాలతో శుక్ర వారం వెళ్తున్న వ్యాన్‌ను పట్టుకున్నట్టు టీడీపీ నాయకులు తెలిపారు.

కంచిలి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): అంపురం జంక్షన్ వద్ద ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 140 ధాన్యం బస్తాలతో శుక్ర వారం వెళ్తున్న వ్యాన్‌ను పట్టుకున్నట్టు టీడీపీ నాయకులు తెలిపారు. ఎటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా అక్రమంగా ఒడిశా నుంచి రాష్ట్రానికి తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు అంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై పట్టుకుని సీఎస్‌డీటీకి అప్పగించామన్నారు. కాగా ఈ ధాన్యం ఒక ప్రజాప్రతినిధి బంధువులకు సంబంధించినవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై సీఎస్‌డీటీ కూర్మారావును సంప్రదించగా.. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని, పట్టుకున్న ధాన్యాన్ని కంచిలి సుందరం ట్రేడర్స్ రైస్ మిల్లు వద్ద ఉంచినట్టు తెలిపారు.