Share News

హామీ ఇచ్చారు..అటకెక్కించారు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:15 AM

తాము అధికారంలోకి వస్తే నర సన్నపేట పట్టణంతోపాటు రోజువారీ కూరగాయల మార్కెట్‌ను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకువస్తామని 2019 ఎన్నికల ముందు వైసీపీ నాయకులు ఇచ్చిన హామీ అటకెక్కింది. రోజు వారీ మార్కెట్‌ను అభివృద్ధి చేసి కూరగాయాలు, చేపలు ఒక్కచోట లభించేలా చర్యలు తీసుకుంటా మని ఐదేళ్ల కిందట వైసీపీ నాయ కులు ఎన్నికల ముందు పేర్కొన్నారు. హామీని విస్మరించడంతో ప్రస్తుతం నరసన్నపేట పంచాయతీ ఏటా లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోవలసి వస్తోంది.

 హామీ ఇచ్చారు..అటకెక్కించారు
నిరుపయోగంగా విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్‌లోని దుకాణాలు:

నరసన్నపేట: తాము అధికారంలోకి వస్తే నర సన్నపేట పట్టణంతోపాటు రోజువారీ కూరగాయల మార్కెట్‌ను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటు లోకి తీసుకువస్తామని 2019 ఎన్నికల ముందు వైసీపీ నాయకులు ఇచ్చిన హామీ అటకెక్కింది. రోజు వారీ మార్కెట్‌ను అభివృద్ధి చేసి కూరగాయాలు, చేపలు ఒక్కచోట లభించేలా చర్యలు తీసుకుంటా మని ఐదేళ్ల కిందట వైసీపీ నాయ కులు ఎన్నికల ముందు పేర్కొన్నారు. హామీని విస్మరించడంతో ప్రస్తుతం నరసన్నపేట పంచాయతీ ఏటా లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోవలసి వస్తోంది.

ఆదాయం కోల్పోతున్న పంచాయతీ

టీడీపీ హయంలో లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన కూరగాయలు మార్కెట్‌ ఆ తర్వాత అభివృద్ధికి నోచుకోలేదు. మార్కెట్‌ నిర్మించి 20 సంవత్స రాలు కావస్తున్నా పంచాయతీ అధికారులు పూర్తిస్థాయి వసతులు కల్పించ లేదు. వ్యాపారులు షాపులకు వెళ్లకుండా రోడ్లుపైనే దుకాణాలు ఏర్పాటు చేసి కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో పంచా యతీ ఏడాదికి సుమారు రూ.10 నుంచి రూ.17ల క్షల వరకు ఆదాయం కోల్పోతోంది.

రోడ్డుపై వ్యాపారాలు.. ఖాళీగా దుకాణాలు

ఏడేళ్ల కిందట కూరగాయలు మార్కెట్‌లో 52 షాపులకు వేలంపాట నిర్వహించగా కేవలం ఐదు షాపులు మాత్రమే పాడారు. మిగతా 47 షాపులు వ్యాపారులు పాడేందుకు ఎవరూ ముందుకు రాలే దు. ఈ నేపథ్యంలో జూనియర్‌ కళాశాల ముఖ ద్వారం నుంచి బజారువీధిలో కూరగాయలు మార్కె ట్‌ వరకు సుమారు 70 మంది వ్యాపారులు రోడ్డు పైనే విక్రయిస్తున్నారు. వీరంతా దుకాణాలకు అద్దె చెల్లించనవసరం లేకుండాపోయింది. కేవలం పంచా యతీకి ఆశీలు మాత్రమే చెల్లించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 47 దుకాణాలు ఖాళీగా ఉండడంతో పంచాయతీకి ఆదాయం రాకపో వడంతోపాటు శిథిలావస్థకు చేరుతున్నాయి.ఏడేళ్ల నుంచి కూరగాయల మార్కెట్‌లో ఐదు షాపుల కూడా ఎటువంటి అద్దె చెల్లించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కూరగాయాలు మార్కెట్‌ మరింత అభివృద్ధి చేస్తామన్న ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, కళాశాల రోడ్డులో ట్రాఫిక్‌ నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ట్రాఫిక్‌కు అంతరాయం

పట్టణంలోని విశ్వేశ్వరయ్య మార్కెట్‌లో దుకాణా లు వ్యాపారాలు సాగిం చకుండా వ్యాపారులు కళా శాల రోడ్డుపై కూరగాయలు, చేపలు విక్రయిస్తున్నా రు. దీంతో ఈ రోడ్డులో ద్విచక్రవాహనాలు తప్పించు కోవడానికి వీల్లేకుండా పో యింది. ఇరువైపలా తోపుడు బళ్లు ఉండడంతో పట్టణంలోని పలు వీధుల వాసులు రాకపోకలకు అవస్థలకు గురవుతున్నారు. తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

పట్టణ నడిబొడ్డున ఉన్న వి శ్వేశ్వరయ్య మార్కెట్‌లో దుకా ణాలు నిత్యం గంజాయి, మందు తాగే వారికి అవాసాలుగా మారాయి. ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పిన నాయకులు తర్వాత మరిచి పోతున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.

- ముద్దాడ గోపాలరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు, మారుతీనగర్‌

ఇబ్బంది పడుతున్నాం

మార్కెట్‌లో షాపులు ఖాళీ ఉండటంతో వ్యాపా రులు రోడ్డు ఎక్కారు. కళాశాల రోడ్డులో కూరగాయాల వ్యాపారులు ఇరువైపుల తోపుడు బళ్లు ఏర్పాటు చేయడంతో మార్కెట్‌లో దిచక్రవాహనాలతో రావాలంటే ఇబ్బంది ఉంది. కూరగాయాల మార్కెట్‌ను అభివృద్ధి చేయాలి. ప్రజాధనం వృధాకాకుండా చూడాల్సి ఉంది.

- శారద, ఉపాధ్యాయిని, నరసన్నపేట

Updated Date - Apr 18 , 2024 | 12:15 AM