Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

తిరిగి పలకరింపే.. వారి తప్పయింది

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:12 AM

కొందరు యువకులు అమ్మవారి జాతరలో ఇద్దరు వ్యక్తులను పలకరించారు. దీంతో వారు కూడా తిరిగి పలకరించారు. అయితే, వారు తమను తిట్టారంటూ యువకులు ఆ వ్యక్తులపై దాడికిపాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఔట్‌ పోస్టు పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివ రాలిలా ఉన్నాయి.

తిరిగి పలకరింపే.. వారి తప్పయింది

- తిట్టారంటూ చితకబాదిన యువ కులు

- ముగ్గురికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం క్రైం: కొందరు యువకులు అమ్మవారి జాతరలో ఇద్దరు వ్యక్తులను పలకరించారు. దీంతో వారు కూడా తిరిగి పలకరించారు. అయితే, వారు తమను తిట్టారంటూ యువకులు ఆ వ్యక్తులపై దాడికిపాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఔట్‌ పోస్టు పోలీసులకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివ రాలిలా ఉన్నాయి. నగరంలోని కిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో టెంట్లు వేసుకుని జీవిస్తున్న సంచార జాతులకు చెందిన పెదాల నాగరాజు, అతని బావ మంజు ఈ నెల 1వ తేదీ రాత్రి కింతలి కనిమెట్ట గ్రామంలో జరిగిన అమ్మవారి సంబరాలను వీ క్షించేందుకు తమ ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి వస్తుండగా దీపావళి సామగ్రి అమ్మే చోటకు వచ్చేసరికి మరో వాహనంపై ముగ్గురు వ్యక్తులు వీరి వెనుకగా వస్తూ.. హాయ్‌ బ్రో అంటూ పలకరించారు. ఈ క్రమంలో నాగరాజు, మంజు తిరిగి వారిని హాయ్‌ బ్రో అంటూ బదులు పలకరించారు. కొద్ది దూరం వెళ్లేసరికి తొలుత పలుకరించిన ఆ ముగ్గురు యువకులు నాగరాజు, మంజును అడ్డగించి.. ఏమని తిట్టారంటూ వారిపై దాడిచేశారు. మంజు వారి నుంచి తప్పించుకుని పారిపోగా, నాగరాజు వారికి దొరికిపోయాడు. దీంతో ఆ ముగ్గురితో పాటు వారి స్నేహితులు మరో ముగ్గురు అక్కడికి చేరుకుని నాగరాజును చితకబాదారు. ఈ విషయం తెలు సుకున్న నాగరాజు సోదరులు శ్రీను, దావీదులు అక్కడికి చేరుకుని దాడిని అడ్డుకు న్నారు. అక్కడి నుంచి తప్పించుకుని తాము ఉంటున్న ప్రాంతానికి వచ్చేశారు. దాడికి పాల్పడిన వారందరూ ఆ ప్రాంతానికి చేరుకుని ఇంట్లో ఉన్న నాగరాజు, అత ని సోదరులపై దాడికి పాల్పడ్డారు. ఈలోగా నైట్‌బీట్‌ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. దాడిలో నాగరాజు, అతని సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం రిమ్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. గస్తీలో ఉన్న పోలీసులు ఉదయం వెళ్లి చికిత్స చేయించుకోవాలని, ఇప్పుడు వెళ్తే వారు మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉందని వారించారు. దీంతో శనివారం వారు రిమ్స్‌కు వెళ్లి చికిత్స చేయించుకుని ఔట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా నాగరాజు, అతని సోదరులు కర్రలతో కొట్టడంతో పైడి వంశీ గాయపడ్డాడు. దీంతో అదే రోజు రాత్రి వంశీ రిమ్స్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. ఈక్రమంలో ఔట్‌ పోస్టు పోలీసులు ఏం జరిగిందని ప్రశ్నించడంతో తన స్నేహితు లు అన్నెపు భరత్‌, పైడి రోహిత్‌తో కలిసి కింతలి గ్రామంలో పండగ చూసుకుని వస్తుండగా ఇద్దరు వ్యక్తులు బండి ఆపి డబ్బులు డిమాండ్‌ చేశారని, సెల్‌ఫోన్లు లాగేసుకునేందుకు ప్రయత్నించారని వివరించారు. దీనిని తాము ప్రతిఘటించగా వారు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారన్నారు. వారిలో ఒక వ్యక్తి పారిపోయాడని, మరో వ్యక్తి పట్టుకున్నట్టు చెప్పారు. అతని బంధువులు, మహిళలు అంతా దాడికి వచ్చారన్నారు. ఈ క్రమంలో గాయాలయ్యాయని, వెంటనే అంబులెన్సులో చికిత్స కోసం తన స్నేహితులతో కలిసి రిమ్స్‌కు వచ్చినట్టు వంశీ చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా తనపై దాడి చేశారని చెప్పుకొచ్చిన వంశీ.. డిశార్చి తీసుకోకుండానే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవడం విశేషం.

Updated Date - Mar 04 , 2024 | 12:12 AM