Share News

ఘనంగా వాసుదేవుని వాహన సేవలు

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:48 PM

మందసలోని వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ వాహనాల సేవలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వాసుదేవుని వాహన సేవలు

మందస, మార్చి 1: మందసలోని వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ వాహనాల సేవలను ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత, ప్రాతఃకాల సేవ, నివేదన, ధ్వజారోహణ, హోమం, విశేష పూజల అనంతరం వాసుదేవ పెరుమాళ్‌ ఉత్సవ విగ్రహా లను హనుమ, శేష వాహనాలపై వేంచేపు చేసి తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామి సేవలో పాల్గొని తరించారు. మహేంద్ర కళా మండలి సభ్యులు భక్తిగీతాలను ఆలపించారు.

నేటి కార్యక్రమాలివే..

వాసుదేవుని బ్రహ్మోత్సవంలో నాలుగోరోజు పొన్న చెట్టు, అశ్వ వాహన సేవలతో పాటు తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే కళాకారులచే కూచిపూడి నృత్యప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Mar 01 , 2024 | 11:48 PM