Share News

ఘనంగా భీష్మ ఏకాదశి

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:27 PM

భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. గ్రామాల్లో మంగళ వారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా భీష్మ ఏకాదశి
పలాస: ఉల్లాసపేటలో స్వామిని దర్శించుకుంటున్న భక్తులు

గ్రామాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

జాతరలతో సందడే సందడి

(ఆంధ్రజ్యోతి బృందం)

భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. గ్రామాల్లో మంగళ వారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాల్లో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఓం నమో నారాయణాయ, గోవిందా గోవింద నామస్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వర స్వామికి గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే వివిధ గ్రామాల్లో జాతరలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

Updated Date - Feb 20 , 2024 | 11:27 PM