Share News

గోపూజ సకల దేవతారాధనతో సమానం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:09 AM

గోమాతను పూజిస్తే సనల దేవతలను ఆరాధించినట్లేనని అరసవల్లి సూర్యనారా యణ స్వామి ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ అన్నారు. కనుమ సందర్భంగా ఆలయంలోని గోశాలలో మంగళవారం గోపూజ నిర్వహించారు.

గోపూజ సకల దేవతారాధనతో సమానం
అరసవల్లిలో గోవులకు పూజ చేస్తున్న ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ

శ్రీకాకుళం క్రైం/అరసవల్లి: గోమాతను పూజిస్తే సనల దేవతలను ఆరాధించినట్లేనని అరసవల్లి సూర్యనారా యణ స్వామి ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ అన్నారు. కనుమ సందర్భంగా ఆలయంలోని గోశాలలో మంగళవారం గోపూజ నిర్వహించారు. గోమాత హిందూ ధర్మ ప్రతీక అని వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌ చార్జి ఈవో చక్రవర్తి, అర్చకులు ధర్భముళ్ల శ్రీనివాసరావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఊడికలపాడులో...
కోటబొమ్మాళి:
సంక్రాంతి పండగలో భాగంగా మూడో రోజైన కనుమ నాడు గోపూజ చేయడం ద్వారా పవిత్రత చేకూరుతుందని కోటబొమ్మాళికి చెందిన ప్రముఖ వేద పండితుడు సుసరాపు చంద్రశేఖర శర్మ అన్నారు. ఊడి కలపాడు శ్రీరామమందిర ప్రాంగణంలో మంగళవారం గో మాతకు ప్రత్యేక పూజలు చేశారు. హిందువులకు అత్యంత పూజనీయమైన గో మాతలను ఇళ్లలో పెంచడం ద్వారా ఆ ఇల్లు, ఆ గ్రామం సుఖ సంతోషాలతో తులతూగుతాయ న్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గొండు లక్ష్మణరావు, శ్రీరామమందిరం సభ్యులు సనపల కరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి గోకులంలో...
పలాసరూరల్‌:
పలాస మండలం రామకృష్ణాపురం సత్యసాయి గోకులంలో కనుమ పండుగ మంగళ వారం నాడు గోపూజ నిర్వహించారు. 23 గోవులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నూతన వస్త్రాలు, ప్రసా దాలు అందించారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్‌ మల్లా రామేశ్వరరావు, పాఠ శాల ప్రిన్సిపాల్‌ ప్రీతి చౌదరి, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

నగరంపల్లిలో...
వజ్రపుకొత్తూరు:
గోవులను పూజించడం మన సంప్రదాయమని డాక్టర్‌ బీఆర్‌ఏయూ పూర్వ వీసీ, ప్రొఫె సర్‌ హనుమంతు లజపతిరాయ్‌ అన్నారు. కనుమ పండ గను పురస్కరించుకుని మంగళవారం నగరంపల్లి లక్ష్మీనారా యణ ఆలయంలో మాజీ సర్పంచ్‌ దువ్వాడ వెంకట కుమార్‌ చౌదరి ఆధ్వర్యంలో గోపూజా కార్యక్రమం నిర్వహిం చారు. గో పూజ, గో రక్షణ అంశాలలో నేటి యువత సంప్ర దాయాలను పాటించాలని కోరారు. గోసేవను అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు దువ్వా డ లక్ష్మి, జయరాం చౌదరి, అప్పారావు, సనపల చక్రవర్తి, దువ్వాడ ఉమామహేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

వీరన్నాయుడు కాలనీలో...
నరసన్నపేట:
హైందవ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హిందూ ధర్మ పరిషత్‌ సభ్యులు నేతింటి సింహాచలం అన్నారు. కనుమ సందర్భం గా మంగళవారం వీరన్నాయుడు కాలనీలో గో పూజను ఆయన ప్రారంహించారు. గోవులను పూజించడం హిందూ సంప్రదాయమన్నారు. పాడి సంపదను పెంచాల న్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ, సాసుపల్లి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. దేశ వానిపేట, కోమర్తి గ్రామాల్లో గోపూజను నిర్వహించిన సహపంక్తి భోజనా లను చేశారు.

కల్యాణ తిరుమల క్షేత్రంలో...
శ్రీకాకుళం కల్చరల్‌:
స్థానిక కలెక్టర్‌ బంగ్లా సమీపం లోని కల్యాణ తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆల య గౌరవాధ్యక్షుడు లోకనాథం నందికేశ్వర రావు, అధ్యక్ష, కార్యదర్శులు మర్రి యోగేశ్వరరావు, బెహరా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పెద్ద జగన్నాథాలయంలో...
ఇచ్ఛాపురం:
కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద జగన్నాథ స్వామి ఆలయంలో మంగళవారం సామూ హిక గోపూజలు నిర్వహించారు. పూజలు చేసి పండ్లు, కూరగాయలు, కొత్త ధాన్యం, కొత్త బియ్యం, బెల్లం ఆవు లకు ఆహారంగా అందించారు. కార్యక్ర మంలో అర్చకులు ఎస్‌ఏ రామప్రసాద్‌ సిద్ధాంతి, పద్మకుమార్‌ ఆచార్యులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కాళ్ల శ్రీనివాస్‌, ప్రకాష్‌, వెంకటరావు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:09 AM