సైబర్ నేరాల్లో గోల్డెన్ అవర్ చాలా కీలకం
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:37 PM
సైబర్ నేరాల సమయంలో గోల్డెన్ అవర్ చాలా కీలకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాల యంలో బ్యాంకు అధికారులు, కోఆర్డినేటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
- ఎస్పీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళంక్రైం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాల సమయంలో గోల్డెన్ అవర్ చాలా కీలకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాల యంలో బ్యాంకు అధికారులు, కోఆర్డినేటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. బ్యాంకుల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలన్నారు. ఏటీఎంల వద్ద నిరంతరం సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేయాల న్నారు. సైబర్ నేరం జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌లో బ్యాంకు అధికారులు సత్వరమే స్పందించి సంబంధిత అకౌంట్లను ప్రీజ్ చేయాలన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు లకు బ్యాంకు అధికారులు సహకరించాలన్నారు. బాధితులు హెల్ప్‌లైన్ నెంబర్ 1930, సైబర్‌క్రైమ్.జీవోవి.ఇన్‌కు ఫిర్యాదు చేసేలా చూడాలన్నారు. ఈసమావేశంలో డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, అప్పారావు, రాజశేఖర్, ప్రసాదరావు, సీఐలు ఇమాన్యుయల్ రాజు, పైడపునాయుడు, ఈశ్వరరావు, సత్యనా రాయణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.