Share News

వైభవం.. చక్రతీర్థం

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:07 AM

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వామి వారి చక్రతీర్థ స్నానాలు ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని తరించారు.

వైభవం.. చక్రతీర్థం
హిరమండలం: చక్రతీర్థ స్నానానికి నంది వాహనంపై తీసుకువెళుతున్న దృశ్యం

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వామి వారి చక్రతీర్థ స్నానాలు ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని తరించారు.

వందలాది మంది భక్తుల సమక్షంలో..

హిరమండలం: హిరమండలం చిన్న కోరాడ వీధిలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి చక్రతీర్థ స్నానం సోమవారం వంశధార నదిలో ఘనంగా నిర్వ హించారు. మధ్యాహ్నం శివ పార్వతుల ఉత్సవ విగ్రహా లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేద మంత్రాల నడుమ చక్రతీర్థ స్నానం చేయించారు. అనంతరం విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామా ల ప్రజలు వేలాది మంది తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పునీతులయ్యారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ప్రతి నిధులు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

కుంటిభద్రలో..

కొత్తూరు: కుంటిభద్ర గ్రామంలో వెలసిన మల్లికార్జున స్వామికి సోమవారం చక్రతీర్థ స్నానాలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను పల్లకిపై వేంచేపు చేసి వంశధార నదికి తీసుకువచ్చి చక్రతీర్థ స్నానా లను వేద ఘోష నడుమ కన్నుల పండువగా చేపట్టారు. కుంటిభద్రతో పాటు పరి సర గ్రామాల ప్రజలు ఆ సమయంలో పవిత్ర స్నానాలను ఆచరించి స్వామిని దర్శించుకున్నారు.

రావివలసలో..

టెక్కలి: రావివలస ఎండల మల్లికార్జునస్వామి తిరువీధి ఉత్సవం సోమవారం మేళతాళాలు, వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహిం చారు. స్వామి ఉత్సవ మూర్తులను సీతకోనేరుకు తీసుకువచ్చి చక్రతీర్థ స్నానాలను ఆచరింపజేశారు. కార్యక్రమంలో ఈవో రాధాకృష్ణ, చైర్మన్‌ సర్లాన సుధాకర్‌, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పాతపట్నంలో..

పాతపట్నం: స్థానిక నీలకంఠేశ్వరుడు, శ్రీకేదారీశ్వరుని చక్రతీర్థ స్నానాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవ విగ్ర హాలను గ్రామంలో తిరువీధి నిర్వహించిన అనంతరం స్థానిక మహేంద్ర తనయ నదిలో భక్తజన సందోహం మధ్య అర్చకులు విశేష పూజలు చేసి, చక్రతీర్థ స్నానం చేయించారు.

పురుషోత్తపురంలో...

సరుబుజ్జిలి: మండలంలోని పురుషోత్తపురంలో సోమవారం వంశ ఽధార నదిలో చక్రతీర్థ స్నానాలు నిర్వహించారు. గ్రామంలోని ఉమా రామలింగేశ్వరస్వామి వారికి మహాశివరాత్రిని పురస్కరించుకుని మూడు రోజులుగా ప్రత్యేక పూజలతో పాటు పాడ్యమి సందర్భంగా స్వామి వారికి వంశధార నదిలో చక్రతీర్థ స్నానం నిర్వహించారు. పురో హితులు గంగవరపు వాసుశర్మ, చంటి శర్మ, ఉమారామలింగేశ్వర దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా నదికి తీసుకెళ్లి చక్రతీర్థం స్నానం చేశారు.

కేకేరాజపురంలో...

బూర్జ: మండలంలోని కేకే రాజపురంలో ఉమాధరాంబికేశ్వర స్వామి వారి చక్రతీర్థ స్నానాలు సోమవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుడు కేశవశర్మ, ఆలయ పూజారి వారణాసి నందికేశ్వరరావు మంత్రోచ్ఛారణలు, మేళతాళాలతో ఏపీపేట సర్పంచ్‌ కొరికాన వెంకట శివసాయి, సీతారామరాజు ఆధ్వర్యంలో చక్రతీర్థ స్నానాలు నిర్వహిం చారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:07 AM