జల్సాలకు అలవాటు పడి..
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:05 AM
జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడిన ఓ అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్‌ను ఒకటో పట్ట ణ పోలీసులు పట్టు కున్నారు.
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడిన ఓ అంతర్ రాష్ట్ర చైన్ స్నాచర్‌ను ఒకటో పట్టణ పోలీసులు పట్టు కున్నారు. ఆదివారం తన కార్యాలయంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద విలేకరులకు ఆ వివరాలను వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 11న తెలుగు ముస లయ్య కాలనీలో నివసిస్తున్న వడ్డి సుజాత తన స్కూటీపై ఖాజీపేట జంక్షన్‌లో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లింది. తిరిగి ఉదయం 9.30 ప్రాంతంలో అరసవల్లి జంక్షన్ వద్దకు వస్తుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడు తెంపి పరారయ్యాడు. దీనిపై బాధితురాలు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సాంకేతికత ఆధా రంగా నిందితుడ్ని విశాఖపట్నంలోని కంచపాలెం సుభాష్ నగర్‌కు చెందిన భీమర శెట్టి కమలనాఽథ్‌గా గుర్తించారు. ఈనెల 19న శ్రీకాకుళంలోని తోటపాలెం రోడ్డులోని షిర్డీసాయి ఆల యం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అతడిని ఎస్‌ఐ హరికృష్ణ, క్రైం సిబ్బంది పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడన్నారు. నిందితుడు ఈనెల 11న అరసవల్లిలో దొంగతనం చేసి, విజయనగరం జిల్లా డెంకాడలో రెండు న్నర తులాల బంగారు ఆభరణం, ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గం పేట గ్రామంలో ఒకటిన్నర తులం బంగారు ఆభరణాలు చోరీ చేసి ముత్తూట్ ఫైనాన్స్‌లో తండ్రి పేరిట తాక ట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సా చేశాడని తెలిపారు. గతేడాది డిసెంబరు 23 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు జైలుశిక్ష అనుభవించాడని, బయటకు వచ్చిన తర్వాత మరలా వరుస దొంగతనాలకు పాల్పడ్డాడని డీఎస్పీ తెలిపారు. ఇతడిపై ఇతర రాష్ట్రాల్లోనూ 30కి పైగా కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కేసును ఛేదించిన సీఐ కె.పైడపునాయుడు, ఎస్‌ఐ హరికృష్ణతో పాటు కీలక సమాచారం సేకరించిన క్రైం సిబ్బందిని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, డీఎస్పీ వివేకానంద ప్రత్యేకంగా అభి నందించి రివార్డులు అందజేశారు.
చైన్ స్నాచర్లపై సస్పెక్ట్ షీట్
జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఎస్పీ ఆధ్వర్యంలో ఛేదించామని, ఈ కేసుల్లో పట్టుబడ్డ వారిపై సస్పెక్ట్ షీట్ తెరుస్తున్నామని డీఎస్పీ వివేకానంద వివరిం చారు. నేరస్థులపై నిఘా ఉంచి నేరాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటు న్నట్టు స్పష్టం చేశారు. ఇకపై నేరాలకు పాల్పడిన వారు జైలు నుంచి విడుదల కాగానే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.