Share News

చెత్తను తీశారు.. వదిలేశారు

ABN , Publish Date - May 16 , 2024 | 11:45 PM

నిత్యంరద్దీగా ఉండే టెక్కలి చిన్నబజారు నుంచి రామదాసుపేట వెళ్లే మార్గంలో కల్వర్టులో చెత్తను తొలగించేందుకు ఈనెల పదోతేదీన పంచాయతీ యంత్రాంగం కాలువపై ఉన్న పలకను తొలగించి చెత్తను రోడ్డు మీద వేసేశారు. దీంతో వాహనచోదకులు, పాదచారులు ఆ మార్గం గుండా రాకపోకలు సాగించేం దుకు అవస్థలుపడుతున్నారు. చెత్త తొలగించలేదు సరికదా కాలువపై పలకను సరిచేయలేదు. నిత్యంరద్దీగా ఉండే రామదాసుపేట రోడ్డుపై ఉన్న మురుగు నిల్వల వల్ల కూడా ఇబ్బందిపడుతున్నారు.తక్షణమే చెత్తను తొలగించికాలువపై పలకను ఏర్పాటుచేసి రాకపోకలకు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

చెత్తను తీశారు.. వదిలేశారు
రామదాసుపేట జంక్షన్‌ వద్ద కాలువపై పలకను తొలగించిన దృశ్యం

టెక్కలి: నిత్యంరద్దీగా ఉండే టెక్కలి చిన్నబజారు నుంచి రామదాసుపేట వెళ్లే మార్గంలో కల్వర్టులో చెత్తను తొలగించేందుకు ఈనెల పదోతేదీన పంచాయతీ యంత్రాంగం కాలువపై ఉన్న పలకను తొలగించి చెత్తను రోడ్డు మీద వేసేశారు. దీంతో వాహనచోదకులు, పాదచారులు ఆ మార్గం గుండా రాకపోకలు సాగించేం దుకు అవస్థలుపడుతున్నారు. చెత్త తొలగించలేదు సరికదా కాలువపై పలకను సరిచేయలేదు. నిత్యంరద్దీగా ఉండే రామదాసుపేట రోడ్డుపై ఉన్న మురుగు నిల్వల వల్ల కూడా ఇబ్బందిపడుతున్నారు.తక్షణమే చెత్తను తొలగించికాలువపై పలకను ఏర్పాటుచేసి రాకపోకలకు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 16 , 2024 | 11:45 PM