Share News

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:15 AM

పలాస రైల్వే స్టేషన్‌ వద్ద భువనేశ్వర్‌-విశాఖ ఇంటర్‌సిటీ రైలులో శుక్రవారం రైల్వే పోలీసులు తనిఖీ చేపట్టి బీహార్‌ రాష్ట్రానికి చెందిన అంత ర్రాష్ట్ర దొంగలను పట్టుకొన్నారు.వారి నుంచి ఏడు తులాల బంగారు, ఐదు తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని, నిందితు లను విశాఖ రైల్వే కోర్టుకు తర లించారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
రైల్వే పోలీసులు పట్టుకున్న బీహార్‌ గ్యాంగ్‌ ముఠా దొంగలు(మాస్క్‌లతో)

ఏడు తులాల బంగారు, ఐదు తులాల వెండి ఆభరణాలు స్వాధీనం

పలాస, ఏప్రిల్‌ 19: పలాస రైల్వే స్టేషన్‌ వద్ద భువనేశ్వర్‌-విశాఖ ఇంటర్‌సిటీ రైలులో శుక్రవారం రైల్వే పోలీసులు తనిఖీ చేపట్టి బీహార్‌ రాష్ట్రానికి చెందిన అంత ర్రాష్ట్ర దొంగలను పట్టుకొన్నారు.వారి నుంచి ఏడు తులాల బంగారు, ఐదు తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకొని, నిందితు లను విశాఖ రైల్వే కోర్టుకు తర లించారు. రైల్వే ఎస్‌ఐ షరీష్‌ విలేకరుల ఎదుట నింది తులను ప్రవేశపెట్టారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన రంజిత్‌ కుమార్‌సాహ్‌, నిశాంత్‌కుమార్‌ మండల్‌, జైలో మండల్‌, ఉదయ్‌కుమార్‌ మండల్‌, అన్స్‌కుమార్‌యాదవ్‌ ఇంటర్‌సిటీ రైలులో సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణిస్తూ లగేజీ బ్యాగులు, పాకెట్‌ కటింగ్‌ చేస్తూ విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారన్నారు. తమ సిబ్బంది సాధారణ తనిఖీల సమ యంలో వీరంతా పరారీ అయ్యేందుకు ప్రయత్నించారని, అనుమానంతో వారిని పట్టుకుని ప్రశ్నించి బ్యాగులు తనిఖీ చేయడంతో అసలు విషయం బయట పడిందన్నారు. వారి వద్ద నుంచి 77 గ్రాముల బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నెల రోజుల వ్యవధిలో బీహార్‌ ముఠా దొంగలను పట్టుకొని రూ.3.39 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకు న్నామని తెలిపారు. దొంగల ముఠాను పట్టుకున్న హెచ్‌సీ కోదండరావు, కానిస్టేబుళ్లు ఎం.సంతోష్‌కుమార్‌, బి.దేవేంద్రనాథ్‌, పి.రమేష్‌ బాబు, టి.తేజలను ఎస్‌ఐ అభినందించారు.

Updated Date - Apr 20 , 2024 | 12:15 AM