మహిళపై మూకుమ్మడి దాడి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:56 PM
తాళ్లవలసకు చెంది వాళ్లే రాధ అనే మహిళపై ఆదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు బుధవారం మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.

- ఐదుగురిపై కేసు నమోదు
లావేరు: తాళ్లవలసకు చెంది వాళ్లే రాధ అనే మహిళపై ఆదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు బుధవారం మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వాళ్లే రాధ ఈ నెల 3న గ్రామంలోని పాల కేంద్రం వద్దకు పాలు తీసుకుని వెళ్లి వస్తుండగా.. కాపువీధిలో నివాసం ఉంటున్న సంచాన సత్యనారాయణ, రేవతి, మీసాల ఈశ్వరమ్మ, రమేష్, క్రిష్ణవేణి కలిసి రాధపై దాడికి దిగారు. ఆమె చీరను లాగేసి చితకబాదారు. దీంతో ఆమె గురువారం లావేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత గొడవులే దాడికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్తు ఎస్‌ఐ సీహెచ్ స్వామినాయుడు తెలిపారు. తాను టీడీపీ సానుభూతిపరులుగా ఉన్నందునే ఇలా దాడికి పాల్పడ్డారని బాధితురాలు రాధ ఆవేదన వ్యక్తం చేసింది.