Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి..

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:29 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం కోటబొమ్మాళి ఎన్టీఆర్‌ భవన్‌లో టెక్కలి మేజర్‌పంచాయతీ రెండు శేరివీధులు, సోగ్గాడిపేట, రెడ్‌క్రాస్‌ వీధి, మండాపొలం కాలనీ, మెట్టవీధి, బ్రాహ్మణవీధి, గోపినాథపురం తదితర ప్రాంతాల నుంచి 500కు పైగా కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.

వైసీపీ నుంచి టీడీపీలోకి..
టెక్కలిలో టీడీపీలో చేరిన వారితో విజయ సంకేతం చూపిస్తున్న అచ్చెన్నాయుడు

- టెక్కలికి చెందిన 500 కుటుంబాలు చేరిక

టెక్కలి, ఫిబ్రవరి 25: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం కోటబొమ్మాళి ఎన్టీఆర్‌ భవన్‌లో టెక్కలి మేజర్‌పంచాయతీ రెండు శేరివీధులు, సోగ్గాడిపేట, రెడ్‌క్రాస్‌ వీధి, మండాపొలం కాలనీ, మెట్టవీధి, బ్రాహ్మణవీధి, గోపినాథపురం తదితర ప్రాంతాల నుంచి 500కు పైగా కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. డొంకాన రామకృష్ణ, భాస్కర్‌జెన్నా, కోళ్ల రామాంజనేయులు, ఉప్పిడి ఎర్రన్న, తేట గోపి, లింగుబారి వేణు, జానీ, కోళ్ల సాయిరాం, నానుబోలు మోహనరావుతో పాటు టెక్కలి మేజర్‌పంచాయతీ గోపినాథపురానికి చెందిన వార్డు సభ్యులు లోకనాథం తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 50 రోజులు ఓపిక పట్టాలని, త్వరలో టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి అధికారం చేపట్టనుందన్నారు. ‘ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి సర్వనాశనం చేశారు. టెక్కలిలో నేను చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది దుష్టశక్తులు అనేక పన్నాగాలు పొందుతున్నారు. రోడ్లు విస్తరణ చేసి విస్తరణలో నష్టపోయిన వారికి హుద్‌హుద్‌ ఇళ్ల కాలనీ ఇస్తామని హామీ ఇస్తే.. అధికార పార్టీ నాయకులు కొందరు ఆ ఇళ్లను స్థానికేతరులకు అమ్ముకున్నారు. గడిచిన ఐదేళ్లలో టెక్కలిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అధికార పార్టీ చేపట్టలేదు’ అని అచ్చెన్న ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రానికి ధీటుగా టెక్కలి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బగాది శేషగిరి, కింజరాపు ప్రసాద్‌, బోయిన రమేష్‌, బోయిన గోవిందరాజులు, వెలమల విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:29 AM