Share News

ఉచిత గ్యాస్‌ వచ్చేస్తోంది

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:49 PM

ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ల పంపిణీకి కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో భాగంగా ప్రతీ ఏడాది మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లను అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు హామీ ఇచ్చారు.

ఉచిత గ్యాస్‌ వచ్చేస్తోంది

- దీపావళి నుంచి పంపిణీకి సన్నద్ధం

(మెళియాపుట్టి)

ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ల పంపిణీకి కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో భాగంగా ప్రతీ ఏడాది మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లను అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఈ మేరకు దీపావళి నుంచే సిలిండర్లను పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత గ్యాస్‌ పథకం పంపిణీ అమలు, వాటికి అయ్యే ఖర్చు, విధివిధానాలను పరిశీలించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ప్రభుత్వం త్వరలో విధివిధానాలు వెల్లడించి పేదలకు సిలెండర్లు అందజేయనుంది. జిల్లాలో 37 ఏజెన్సీల పరిధిలో 5,65,508 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 1,81,041 జనరల్‌ సింగిల్‌ కనెక్షన్లు, 1,20,171 డబుల్‌ కనెక్షన్లు ఉన్నాయి. దీపం పథకం కింద సింగిల్‌ కనెక్షన్లు 1,76,487 ఉండగా, డబుల్‌ కనెక్షన్లు 16,748 ఉన్నాయి. ఉజ్వల కనెక్షన్లు 56,584 ఉన్నాయి. తెలుపు రేషన్‌ కార్డులు ఉన్నవారందరికీ ఏడాదికి మూడు సిలెండర్లు అందజేయనున్నారు. ఇప్పటికే గ్యాస్‌ ఏజెన్సీలు వినియోగదారుల బయోమెట్రిక్‌ ప్రక్రియ చేపడుతున్నాయి.

Updated Date - Oct 07 , 2024 | 11:49 PM