Share News

వేర్వేరు ఘటనలో నలుగురి మృతి

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:36 AM

జిల్లాలో వేర్వేరు ఘటనలో ఆదివారం నలుగురు మృతిచెందారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాధచాయలు అలముకున్నాయి.

 వేర్వేరు ఘటనలో నలుగురి మృతి

జిల్లాలో వేర్వేరు ఘటనలో ఆదివారం నలుగురు మృతిచెందారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాధచాయలు అలముకున్నాయి.

వంశధార నదిలో కాలుజారి వృద్ధుడు

గార: గార పంచాయతీ పరిధిలోగల కుమ్మరిపేటకు చెందిన మళ్ల జగ్గునాయుడు (86) ఆదివారం గార వద్ద వంశధార నదిలో కాలు జారి ప్రమాదవశా త్తు మృతిచెందినట్లు పోలీ సులు తెలిపారు. జగ్గునాయుడు నది వద్దకి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లినట్లు చెప్పా రు. ఆ సమయంలో కాలు జారి నదిలో పడి మృతి చెందాడు. ఆయన సోదరుడు కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌.ఐ.కృష్ణప్రసాద్‌ తెలిపారు.

వేటకు వెళ్లి మత్స్యకారుడు..

సోంపేట: మండలంలోని ఇస్కలపాలేం గ్రామానికి చెందిన మత్స్యకారుడు పుక్కళ్ల ధర్మారావు(65) గుండెపోటుతో ఆదివారం మృతిచెందాడు. తోటి మత్స్య కారులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఎప్పటిలాగానే సముద్రంలో చేపల వేట కోసం తోటి మత్స్యకారు లతో పడవలో ధర్మారావు వెళ్లాడు. వేట ముగిసిన అనంతరం తిరిగివస్తుండగా తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ధర్మారావుకు ఒక్కసారిగా సముద్రంలో గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య దమయంతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వేటసాగించి కుటుంబాన్ని పోషించుకుంటున్న కుటుంబపెద్ద మరణించడంతో భార్య, పిల్లలు అనాథలుగా మారారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కుటుంబాన్ని ఆదుకోవా లని మాజీ సర్పంచ్‌ బాబూరావు కోరారు.

తెప్ప బోల్తా పడి..

రణస్థలం: కొచ్చెర్ల పంచాయతీ పరిధిలోని కొత్తముక్కాం గ్రామానికి చెందిన మత్స్య కారుడు కుందు ఆనంద్‌ (30) మృతి చెం దాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కుందు ఆనంద్‌తో పాటు మరో ముగ్గురు ఎం.పోతురాజు, కె.పాలిరాజు, కె.అమ్మోరు సము ద్రంలో పీతల వేటకు శనివారం సాయంత్రం వెళ్లారు. పీతల వల సముద్రంలో వేసి తిరిగి వస్తున్న సమయంలో తీరం ఒడ్డున అలలు ఎక్కువ కావడంతో తెప్ప బోల్తా పడింది. ఆయనతో వెళ్లిన మరో ముగ్గురు సురక్షంగా ఒడ్డికి చేరుకున్నారు. కుందు ఆనంద తెప్పకింద ఇసుకలో కూరుకు పోయాడు. ఆనందను బయటకుతీసి 108 వాహనంపై శ్రీకాకుళం ప్రభుత్వాసు పత్రికి తరలించారు. ఆనంద్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి కుందు పోలీస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం పోలీసులు కేసునమోదు చేశారు.

టెక్కలి వద్ద రోడ్డు ప్రమాదంలో...

జలుమూరు: టెక్కలి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమా దంలో తలతరియా పంచాయతీ ఎర్రన్నపేటకు చెందిన బల గోవింద రావు అలియస్‌ గోపి (26) మృతిచెందాడు. పలాస నుంచి టెక్కలి వైపు కారులో వస్తున్న గోవిందరావు టెక్కలి సమీపంలో లారీ ఢీకొని మృతిచెందాడు. దీంతో ఆయన స్వగ్రామం ఎర్రన్న పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:36 AM