Share News

ఫారం-16 అందుబాటులో ఉంచాలి

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:39 PM

పెన్షనర్లకు ఫారం-16 అందుబాటులో ఉంచా లని ఆ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురవరపు శిమ్మినా యుడు, బొడ్డేపల్లి జనార్దనరావు కోరారు.

ఫారం-16 అందుబాటులో ఉంచాలి

ఆమదాలవలస: పెన్షనర్లకు ఫారం-16 అందుబాటులో ఉంచా లని ఆ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురవరపు శిమ్మినా యుడు, బొడ్డేపల్లి జనార్దనరావు కోరారు. ఈ మేరకు బుధ వారం స్థానిక సబ్‌ ట్రెజరీ అధికారి ఎస్‌.సువర్ణరాజుకు వినతిపత్రం అందిం చారు. దీనిపై స్పందించిన ఆయన నేటి నుంచి ఫారం-16 అందుబాటులో ఉంచు తామన్నారు పెన్షనర్లు ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 31వ తేదీలోగా ఈఫై లింగ్‌ చేసుకోవాలని, సబ్‌ ట్రెజరీ అధికారి తెలిపారని ఆ సంఘ నాయకులు తెలి పారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘ గౌరవాధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్‌రావు, కోశాధికారి హెచ్‌వీ సత్యనారాయణ, పేడాడ భానోజీరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:39 PM