Share News

జానపద కళలను పరిరక్షించాలి

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:14 AM

జానపద కళలలను పరిరక్షించి వాటిని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరి పై ఉందని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర గొమాంగో అన్నారు. పలాస మండలం రంగోయి గ్రామం లో గిడుగు రామమూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం, బద్రి అప్పన్న స్మారక పీఠం 20వ వార్షికోత్సవ కళాజాతర ఆదివారం నిర్వహించారు.

జానపద కళలను పరిరక్షించాలి
వివిధ పరికరాలతో సంగీత ధ్వని నిర్వహిస్తున్న గిరిధర్‌ గొమాంగో

ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గొమాంగో

ఉత్సాహంగా కళాజాతర

పలాసరూరల్‌: జానపద కళలలను పరిరక్షించి వాటిని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరి పై ఉందని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర గొమాంగో అన్నారు. పలాస మండలం రంగోయి గ్రామం లో గిడుగు రామమూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం, బద్రి అప్పన్న స్మారక పీఠం 20వ వార్షికోత్సవ కళాజాతర ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాటా ్లడుతూ.. ఒకనాడు పల్లె పాటలు, వాయిద్యాలతో ఊరూరా ప్రదర్శనలు చేసేవారని, ప్రస్తుతం పాశ్చాత్య ప్రభావంతో అవి కనుమరుగ వుతున్నాయన్నారు. వాటిని బతికించేందుకు ఇటువంటి సంస్థ లు కృషి చేయడం అభినందనీయమన్నారు. జానపద గ్రంథ రచయిత కృష్ణారెడ్డి జానపద కళల ఔన్నత్యం, వాటి విశిష్ట తను వివరించారు. కళింగసీమ సాహిత్య సంస్థ అధ్య క్షుడు సన్నశెట్టి రాజశేఖర్‌, శాస్త్రీయ నృత్యకళాకారిణి నిర్మలాదేవి, రాయలసీమ జానపద గాయకురాలు సోమిశెట్టి సరళ మాట్లా డుతూ.. కళలను పరిరక్షించేందుకు సంస్థ చేస్తు న్న కృషిని కొనియాడారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గొమాంగో వివిధ పరికరాలు, వస్తువులపై గరిటెలతో చేసిన ప్రదర్శనతో సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. అలాగే వివిధ జానపద కళలను కళాకారులు ప్రదర్శించగా వారిని నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో సంఘ వ్యవస్థాప కుడు బద్రి కూర్మారావు, కళాకారులు గండు కామేశ్వరరావు, కిక్కర ఢిల్లీ రావు, ఓంకార్‌, గేదెల తులసయ్య, వాసుదేవరావు, మనోజ్‌ కుమార్‌ దాసరి తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:14 AM