Share News

వసతిగృహాల్లో మరమ్మతులపై దృష్టి

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:59 PM

వసతిగృహాల్లో మర మ్మతులపై దృష్టి సారించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలి పారు. కలెక్టరేట్‌లో గురువారం పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌, భోజన ఖర్చులు, వసతిగృహాల్లో సమస్యలపై ఆయన సమీక్షిం చారు.

వసతిగృహాల్లో మరమ్మతులపై దృష్టి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): వసతిగృహాల్లో మర మ్మతులపై దృష్టి సారించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలి పారు. కలెక్టరేట్‌లో గురువారం పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌, భోజన ఖర్చులు, వసతిగృహాల్లో సమస్యలపై ఆయన సమీక్షిం చారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఏటీడబ్లుఓ శ్రీనివాసరావు, జిల్లా బీసీ సంక్షేమాధికారి అనూరాధ, సోషల్‌ వెల్ఫేర్‌ శాఖ ఏడీ విశ్వ మోహన్‌రెడ్డి వసతిగృహాల్లో సమస్యలను వివరించారు. మందస ఆశ్రమ పాఠశాలలో సీట్లు ఖాళీగా ఉండడంపై కలెక్టర్‌ అడగ్గా.. వసతి భవనం చాలడం లేదని వార్డెన్‌ చెప్పారు. కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపా లని కలెక్టర్‌ ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఇతర కులాల విద్యార్థులు కూడా ఉండవచ్చని ఏటీడబ్ల్యువో శ్రీనివాసరావు తెలిపారు. కమాటీ, కుక్‌, వాచ్‌మన్‌కు సంబంధించి 203 రెగ్యులర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. బీసీ సంక్షేమాధికారి అనూరాధ మాట్లాడుతూ.. వసతిగృహాల మరమ్మతు లకు సంబంధించి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి అనుమతించాలని కోరారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. మరమ్మతుల కోసం త్వరలో నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. అలాగే సగం నిర్మాణంలో ఉన్న భవనాల వివరాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. పరీక్ష ఫీజులు చెల్లించ లేదనే కారణంతో హాల్‌టిక్కెట్లు జారీ చేయని పాఠ శాలల యాజమాన్యాలపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఉపకార వేతనాలకు 50,948 మంది అర్హులు ఉన్నారని వివరించారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:59 PM