Share News

పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక వసతులపై దృష్టి సారించండి

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:46 PM

నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక వసతులపై దృష్టి సారించాలని టెక్కలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌ అన్నారు. బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సెక్టో రియల్‌ అధికారులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వ హించారు.

పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక వసతులపై దృష్టి సారించండి
అధికారులతో సమీక్షిస్తున్న ఆర్వో నూరుల్‌ కమర్‌

రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌

టెక్కలి, ఫిబ్రవరి 28: నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్‌ స్టేషన్లలో మౌలిక వసతులపై దృష్టి సారించాలని టెక్కలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నూరుల్‌ కమర్‌ అన్నారు. బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సెక్టో రియల్‌ అధికారులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ స్టేషన్లలో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, దివ్యాంగుల నిమిత్తం ర్యాంపులు ఉన్నవీ, లేనివీ పరిశీలించి వాటిని ఏర్పా టు చేయాలన్నారు. ఒక్కో సెక్టోరియల్‌ అధికారికి ఎనిమిది నుంచి పది వరకు పోలింగ్‌ స్టేషన్లు అప్పగించడం జరిగిం దన్నారు. ఈ పరిధిలో గతంలో క్రిమినల్‌ కేసులున్న వారు ఎవరైనా ఉంటే గుర్తించాలని, అలాగే అతి సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు ఉంటే గుర్తించి నివేదిక అందజేయాలన్నారు. ఎక్కడైనా పోలింగ్‌ కేంద్రాలకు పేర్లు మారిస్తే తెలియజేయా లని సూచించారు. సమావేశంలో ఏఆర్వోలు, ఎలక్షన్‌ డీటీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:46 PM