Share News

ఐదు కోట్ల మంది ఓ పక్క.. జగన్‌ మరో వైపు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:04 AM

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఓవైపు.. జగన్‌రెడ్డి మరోవైపు ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి నందిగాం మండలం గొల్లూరు, రాంపురం, రధజన బొడ్డ పాడు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 ఐదు కోట్ల మంది ఓ పక్క.. జగన్‌ మరో వైపు
టెక్కలి: నందిగాం మండలం గొల్లూరు ప్రచారంలో అచ్చెన్నాయుడుకు మేకపిల్లను అందిస్తున్న దృశ్యం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

టెక్కలి: ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఓవైపు.. జగన్‌రెడ్డి మరోవైపు ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి నందిగాం మండలం గొల్లూరు, రాంపురం, రధజన బొడ్డ పాడు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ హయాంలో నందిగాం మండల రైతాంగానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్నామన్నారు. రాం పురం గ్రామానికి చెందిన వలంటీర్‌ కిక్కిరి ధనలక్ష్మి, వార్డు మెంబర్‌ పొట్నూరు గణేష్‌ టీడీపీలో చేరారు. వీరికి అచ్చెన్నా యుడు కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్‌, జనసేన ఇన్‌చార్జి కణితి కిరణ్‌కుమార్‌, బీజేపీ ఇన్‌చార్జి అట్టాడ రవిబాబ్జీ, బూరె నరేంద్ర, రాంపురం సర్పంచ్‌ జోగారావు, గొల్లూరు నాని, మెట్ట పద్మావతి, కింగ్‌, బాలక్రిష్ణ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత

టెక్కలి: రానున్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని అనేక సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయని, మన కష్టాలు తీరనున్నాయని, ఈసారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 22న 10 గం టలకు తాను 50 వేల మందితో నామినేషన్‌ వేయనున్నా నని, మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు తరలిరావాలని కోరా రు. కార్యక్రమంలో నాయకులు బగాది శేషగిరి, బోయిన రమేష్‌, పినకాన అజయ్‌కుమార్‌, ఎల్‌ఎల్‌ నాయుడు, తర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన 90 వైసీపీ కుటుంబాలు

టెక్కలి/సంతబొమ్మాళి/మెళియాపుట్టి: టెక్కలి, సంత బొమ్మాళి మండలాల నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. గురువారం నిమ్మాడ క్యాంపు కార్యాలయం లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు కండువాలు వేసి ఆహ్వానించారు. సంతబొమ్మాళి మండలం సుగ్గువానిపేట నుంచి 20 కుటుంబాలు, గోవింద పురం పంచాయతీ నుంచి 50 కుటుంబాలు, టెక్కలి పంచా యతీ లచ్చన్న పేట నుంచి 20 కుటుంబాలు, బూరగాం పంచాయతీ మాజీ సర్పంచ్‌ గేదెల రమణయ్యతో పాటు 20 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.

మెళియా పుట్టి సర్పంచ్‌ రేఖాన లక్ష్మి, వాసుతో పాటు ఉప సర్పంచ్‌ మాడుగుల భానోజీరావు, అనుచరులు పార్టీలో చేరారు. వీరికి అచ్చె న్నాయుడు కండువాలు వేసి ఆహ్వానిం చారు. కార్యక్ర మంలో పార్టీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి, మాజీ ఎంపీపీ కర్రి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:04 AM