పడవ బోల్తాపడి మత్స్యకారుడు మృతి
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:03 AM
పడవబోల్తాపడి వాడపాలెం గ్రామానికి చెం దిన పలిశెట్టి జోగారావు(48) ఆదివారం మృతిచెందాడు.

సోంపేట: పడవబోల్తాపడి వాడపాలెం గ్రామానికి చెం దిన పలిశెట్టి జోగారావు(48) ఆదివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెక్క సింహాచలం, బడే కుమారస్వామి, చెక్క దానయ్య, బుడగట్ల భాస్కర్‌తో కలిసి జోగారావు ఆదివారం వేకువజామున వేటకు బయలు దేరారు. అయితే అలల ఉధృతికి పడవ బోల్తాపపడడంతో జాగారావు మృతి చెందారు. జోగారావుకు భార్య పార్వతి, కు మారుడు రాజు, కుమార్తె లక్ష్మి ఉన్నారు. మృతుడి కుటుంబా నికి ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.